హత్యాచార ఘటనకు నిరసనగా ర్యాలీలు
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:25 AM
కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జార్జ్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, ఆగస్టు 20: కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జార్జ్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో స్త్రీలు, చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. త్వరగా శిక్షించ డం వలన ఇటువంటి ఘటనలు పునరావృతం కావన్నారు. మహిళను గౌరవించే విధంగా నడవడికలు నేర్పించాలన్నారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.రాజారావు, కెమిస్ట్రీ హెచ్‌వోడీ సునీత, సీఈవో డాక్టర్ అశోక్, అసోసియేట్ ప్రొఫెసర్లు ముజీఫ్, సురేష్ పాల్గొన్నారు.
కంభం : కలకత్తాలో వైద్య విద్యార్థిని పై జరిగిన హత్యాచారం ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తురిమెళ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు తురిమెళ్ల గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సోని మాట్లాడుతూ వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘బతక నిద్దాం స్త్రీలను’ అంటూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పీవో శ్రీనివాసులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
కంభం : కలకత్తా మెడికల్ కళాశాల విద్యార్థినిపై జరిగిన ఘాతుకానికి నిరసనగా మంగళవారం కంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. శ్రీనివాసరావు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:25 AM