నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:53 PM
ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. సోపిరాల రైల్వేగేటు సెంటర్‌లో జరుగుతున్న విద్యుత్ పనులను శనివారం ఆయన పరిశీలించారు.
చినగంజాం, ఆగస్టు 24 : ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విద్యుత్ శాఖాధికారులకు సూచించారు. సోపిరాల రైల్వేగేటు సెంటర్‌లో జరుగుతున్న విద్యుత్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. సోపిరాల రైల్వేగేటు సెంటర్‌లో 100 కేవీ విద్యుత్ టాన్స్‌ఫారం దిమ్మ దెబ్బతిందని, ఆప్రాంతంలోని విద్యుత్ లైన్లు కిందికి వేలాడుతున్నాయని ఇటీవల సోపిరాల గ్రామస్థులు ఎమ్మెల్యే ఏలూరికి సమస్యను వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఏఈ పి.గణనారాయణను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్యెల్యే ఆదేశాలతో విద్యుత్ శాఖాధికారులు రూ.3లక్షల నిధులతో శనివారం పనులను ప్రారంభించారు. ట్రాన్స్‌ఫారమ్ దిమ్మె నిర్మాణం, 35 అడుగుల విద్యుత్ స్తంభాలు రెండు, 30 అడుగుల స్తంభాలు రెండు, సపోర్టు స్తంభాలు నాలుగు, కేబుల్ వైరు వినియోగిస్తున్నామని, పనులను రెండు రోజులలో పూర్తి చేస్తామని ఏఈ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొద వీరయ్య, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:53 PM