ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీసీ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:44 AM

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లోని గ్రామాలకు రూ.25కోట్ల సీసీ రోడ్డులు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అధికారులకు సూచించారు.

పుల్లలచెరువు, జూలై 30: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలల్లోని గ్రామాలకు రూ.25కోట్ల సీసీ రోడ్డులు వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అధికారులకు సూచించారు. మంగళవారం మార్కాపురంలోని తన కార్యాలయంలో పంచా యతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, పశువైద్యాశాఖధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియో జకవర్గంలో రోడ్లకు మహర్దశ పట్టనుంద న్నారు. అస్తవ్యాస్ధంగా వున్న రోడ్డుల మరమ్మతులకు, నూతనంగా కావాల్సిన సీసీ రోడ్డులకు ప్రణాళికబద్ధంగా ప్రతి పాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నియోజక వర్గంలో అధ్వానంగా వున్న ఆర్‌అండ్‌బీ రోడ్డులను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. మినీ గోకులాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్‌ డీఈ మద్దుల సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:45 AM

Advertising
Advertising
<