ఢిల్లీ వైపు పెద్దిరెడ్డి చూపు..!
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:09 AM
శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోడ దూకేందుకు ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధం
మంత్రి స్వామి సంచలన వ్యాఖ్యలు
మర్రిపూడి, జూన్ 18 : శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధమయ్యారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్రిపూడి మండలం రామాయపాలెంలో సోమవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కోల్పోయి పట్టుమని పదిరోజులు కాకముందే వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నా రని ఆయన అన్నారు. టీడీపీలో చేర్చుకోరన్న విషయాన్ని గుర్తించి పెద్దిరెడ్డి ఢిల్లీ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో నలుగురిని వైసీపీ లాగేసుకున్నా మిగిలిన 19మంది శాసనసభ్యులం చంద్రబాబు సారథ్యంలో అలుపెరుగని పోరాటం చేశామని గుర్తు చేశారు. చంద్రబాబును 53 రోజులపాటు జైల్లో నిర్బంధించడంతో టీడీపీ కార్యకర్తల్లో కసి, పట్టుదల పెరిగిందన్నారు. ఎన్నికల్లో నరకాసుర వధ జరిగిందని, దేవుడు రాసిన స్ర్కిప్ట్ వైసీపీని కేవలం 11 సీ ట్లకే పరిమితం చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆ పార్టీని సజీవంగా చంపేసిందన్నారు.
Updated Date - Jun 19 , 2024 | 12:10 AM