ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలు ఎయిర్‌ పోర్టు మళ్లీ తెరపైకి

ABN, Publish Date - Aug 18 , 2024 | 11:26 PM

ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తాజాగా చేసిన ప్రకటనతో దానిపై మళ్లీ చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితమే ఒంగోలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు వద్ద భూములను కూడా గుర్తించారు. అనంతరం అది మరుగునపడింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలను 14కు పెంచనున్నట్లు ప్రకటించారు. అందులో ఒంగోలు కూడా ఉంది.

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటనతో విస్తృత చర్చ

పదిరోజుల క్రితం పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ మాగుంట

మూడు రోజుల ముందే ప్రతిపాదన

20 ఏళ్ల క్రితమే భూముల గుర్తింపు

అనంతరం మరుగునపడిన వైనం

సీఎం చంద్రబాబు జోక్యంతో కదలిక

ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తాజాగా చేసిన ప్రకటనతో దానిపై మళ్లీ చర్చ మొదలైంది. రెండు దశాబ్దాల క్రితమే ఒంగోలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అప్పట్లో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు వద్ద భూములను కూడా గుర్తించారు. అనంతరం అది మరుగునపడింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలను 14కు పెంచనున్నట్లు ప్రకటించారు. అందులో ఒంగోలు కూడా ఉంది.

ఒంగోలు, ఆగస్టు 18 (ఆంఽధ్రజ్యోతి) : ఒంగోలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు 20 ఏళ్ల క్రితమే బీజం పడింది. అయితే అది ప్రతిపాదనలకే పరిమితమై అనంతరం మరునపడింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004--07 మధ్య ఉన్న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణపై ప్రకటన చేసింది. ఆ సమయంలో ఒంగోలుకు ఎయిర్‌పోర్టు ప్రకటించింది. ఆవెంటనే ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. సుమారు 650 ఎకరాలు అవసరమని తేల్చారు. ఆమేరకు భూములను కూడా గుర్తించారు. ఒంగోలు చిన్న పట్టణమే అయినప్పటికీ ప్రపంచప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్‌, విస్తారంగా తీరప్రాంతం ఉండి భారీగా ఆక్వా సాగు, దేశంలోనే అత్యధికంగా పొగాకు పంట వంటి వ్యాపార సంబంధ అంశాలతోపాటు అప్పట్లో వాన్‌పిక్‌ ప్రతిపాదన తదితర సానుకూల అంశాలను చూపి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన చేశారు. కేంద్ర విమానయానశాఖకు చెందిన అధికారులు పరిశీలన కూడా అప్పట్లోనే పూర్తయ్యింది. భూ సంబంధ వివాదాలు కొంత, ఇతరత్రా కారణాలతో ఆ అంశం ప్రతిపాదనలకే పరిమితమైంది.

మరుగునపడిన గత ప్రతిపాదన

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు 2009-14ఽమధ్య నాటి నెల్లూరు జిల్లాలో దగదర్తి వద్ద ఎయిర్‌ పోర్టు, దుగరాజపట్నం వద్ద పోర్టు.. అలాగే ప్రకాశం జిల్లాలో రాయమపట్నం వద్ద పోర్టు, ఒంగోలు వద్ద ఎయిర్‌ పోర్టు ప్రతిపాదనలు పరిశీలన చేసి ఒకే జిల్లాలో అటు పోర్టు, ఇటు ఎయిర్‌పోర్టు రెండూ నిర్మాణం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో ఎయిర్‌ పోర్టు, ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మిచాలని అనఽధికారికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో ఒంగోలు ఎయిర్‌పోర్టు మరుగునపడి నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్‌ పోర్టు ముందుకు కదిలింది. దీంతో ఒంగోలు ఎయిర్‌పోర్టు లేనట్లేనన్న భావన వచ్చింది. ఆతర్వాత దొనకొండలోని పురాతన విమానశ్రయ పునరుద్ధరణ చర్యలు, కదలికతో ఇక ఒంగోలు విమానాశ్రయం లేనట్లేనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది.

ఒంగోలులో ఎయిర్‌పోర్టుపై అధ్యయనం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు కీలక రంగాలపై కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అందులో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి, కొత్తవి ఏర్పాటు వ్యవహారంపై సంబంధిత మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కూడా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలను 14కు పెంచనున్నట్లు ప్రకటించారు. అందులో ఒంగోలు కూడా ఉంది. ఒంగోలులో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. వివిధ వర్గాల ప్రజల్లో దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. గతంలోనే భూములు గుర్తింపు కూడా జరిగిన నేపథ్యంలో పాలకపక్ష నేతలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

టీడీపీ కూటమి ప్రభుత్వంలో మళ్లీ కదలిక

రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మౌలిక రంగాల అభివృద్ధి, అందులోనూ కేంద్రం సహకారంతో చేపట్టే రోడ్డు, రైలు, ఎయిర్‌వేస్‌, జల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. పాత ప్రతిపాదనల పైళ్లు దుమ్ముదులిపి తిరిగి కేంద్రం వద్ద చర్చకు పెడుతోంది. ఈ క్రమంలో ఒంగోలు ఎయిర్‌ పోర్టు అంశం తిరిగి తెరపైకి వచ్చింది. పది రోజుల క్రితం పార్లమెంట్‌లో విమానాశ్రయాల విస్తరణపై జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎయిర్‌పోర్టు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న ప్రతిపాదనలు, మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువుగా భూముల గుర్తింపు తదితరాలను వివరించి 60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్ర నిధులతో నిర్మించాలని కోరారు.

Updated Date - Aug 18 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<