ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యా పథకాలకు మహనీయుల పేర్లు

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:10 AM

పాఠశాల, కళాశాల విద్యలో విద్యార్థులకు అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం మార్చేసింది. గత ప్రభుత్వంలో జగనన్న పేరుతో అమలైన ఈ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టి వారిని గౌరవించింది.

పాతవాటిని మార్చిన కూటమి ప్రభుత్వం

ఒంగోలు (విద్య), జూలై 30 : పాఠశాల, కళాశాల విద్యలో విద్యార్థులకు అమలుచేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం మార్చేసింది. గత ప్రభుత్వంలో జగనన్న పేరుతో అమలైన ఈ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టి వారిని గౌరవించింది. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేలా మూడు పథకాలకు పేర్లు ప్రకటించింది. పాఠశాల విద్యార్థులకు ఇప్పటి వరకూ జగనన్న గోరుముద్ద పేరుతో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చింది. జగనన్న విద్యాకానుక పేరుతో విద్యార్థులకు అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇకపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్రగా అమలు చేయనుంది. జగనన్న అణిముత్యాలు పేరుతో విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను అబ్దుల్‌కలాం ప్రతిభా సేవా పురస్కారంగా ప్రభుత్వం మార్పు చేసింది.

మారిన మధ్యాహ్న భోజనం మెనూ

పాఠశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన మెనూను ప్రభుత్వం మార్చింది.

సోమవారం కూరగాయల పలావ్‌, కోడిగుడ్ల కూర, వేరుశనగ చిక్కీ

మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, రాగిజావ, ఉడికించిన కోడిగుడ్డు

బుధవారం కూరగాయల అన్నం, ఆలూకుర్మ, ఉడికించిన కోడిగుడ్లు, వేరుశనగ చిక్కీ

గురువారం సాంబార్‌ బాత్‌/లెమన్‌ రైస్‌, టమోటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు

శుక్రవారం అన్నం, ఆకుకూరపప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ చిక్కీ

శనివారం ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్‌ పొంగల్‌

వంట నిర్వాహకులు, హెచ్‌ఎంల అనుమతిలో విద్యార్థులకు సరిపోయేలా అన్నం, గుడ్లు, చిక్కీలు ఇవ్వాలి. వంట చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. వంటకు ముందు నిర్వాహకులు విధిగా యూనిఫాం ధరించాలని ప్రభుత్వం అదేశించింది.

---------------------------

-------------------------------------

Updated Date - Jul 31 , 2024 | 01:10 AM

Advertising
Advertising
<