మండలాభివృద్ధికి తోడ్పాటు అందించాలి
ABN, Publish Date - Aug 30 , 2024 | 12:57 AM
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలా భివృద్ధికి తోడ్పాటు అందించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీపీ సూ రెడ్డి భూలక్ష్మీ కోరారు.
తర్లుపాడు, ఆగస్టు 29: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలా భివృద్ధికి తోడ్పాటు అందించి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఎంపీపీ సూ రెడ్డి భూలక్ష్మీ కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎస్.నరసింహులు మాట్లాడుతూ.. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. సర్పంచులు, అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. గ్రామాల్లో పారిశుఽ ద్యంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నీళ్ల ట్యాంకులను 15 రోజులకొకసారి ఖచ్చితంగా క్లోరినేషన్ చేయాలన్నారు. దోమలువ్యాప్తి చెందకుండా మందులు పిచికారి చేయాలని సూచించారు. ఏపీవో ఎం.చిన్నకొండయ్య మాట్లా డుతూ, ఉపాధిహామీ పథకం ద్వారా మండలం లో 214 ఎకరాల పండ్ల తోటలు పెంచుకు నేందుకు దరఖాస్తులు అందినట్లు ప్రస్తుతం 100 ఎకరాలకు పండ్ల తోటలు పెంచుకునేందుకు మంజూరైనట్లు ఆయన తెలిపారు. మండలంలో 25 గోకుళంషెడ్లు కూడా మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలానికి 200 రైతు కుంటలు మంజూరైన ట్లు ఆయన పేర్కొన్నా రు. పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. మండ లంలో రూ.3.61కోట్లతో సీసీ రోడ్లు వేయనున్న ట్లు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మార్కాపురం నుంచి తర్లు పాడు వరకు కొత్తరోడ్లు వేసేందుకు రూ.3కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సదరు కాంట్రాక్టర్ పనులు చేయడానికి పనులు మొద లు పెట్టలేదన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కదుల నారాయణరెడ్డి డబల్ రోడ్డు వేసేందుకు కూడా ప్రతిపాదన పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేతగుడిపి, సూరెపల్లి, జగన్నాథపురం, పోతలపాడు గ్రామాలలో జల జీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు సర్పంచ్‌లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేతగుడిపి, బుడ్డపల్లి, పోతలపాడు, గానుగ పెంట గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొం దని సర్పంచ్‌లు సమావేశం దృష్టికి తీసుకొ చ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెన్నా ఇందిరా, వ్యవసాయాదికారి చంద్రశేఖర్‌రావు, వెలుగు ఏపీఎం డి.ప్య్యి, విద్యుత్ శాఖ ఏఈ హనుమాన్ నాయక్, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 12:57 AM