పర్చూరులో రోడ్లకు మహర్దశ
ABN, Publish Date - Jul 02 , 2024 | 10:43 PM
పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా మారాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాం లో ఆ రోడ్లకు మహర్దశ పట్టనుంది. రోడ్ల మరమ్మతులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఏలూరి మంగళవారం అర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్‌రెడ్డిని కలిసి రూ.200 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ, బీటీ రోడ్ల మరమ్మతులు, తారు రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాలను కలిపే లింక్ రోడ్ల ఏర్పాటుపై మంత్రికి ప్రతిపాదనలు అందజేశారు.
అభివృద్ధికి రూ.200 కోట్లతో ప్రతిపాదనలు
నిధులు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్‌రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి వినతి
పర్చూరు, జూలై 2 : పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా మారాయి. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాం లో ఆ రోడ్లకు మహర్దశ పట్టనుంది. రోడ్ల మరమ్మతులపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఏలూరి మంగళవారం అర్‌అండ్‌బీ మంత్రి జనార్దన్‌రెడ్డిని కలిసి రూ.200 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ, బీటీ రోడ్ల మరమ్మతులు, తారు రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాలను కలిపే లింక్ రోడ్ల ఏర్పాటుపై మంత్రికి ప్రతిపాదనలు అందజేశారు. వైసీపీ నిర్లక్ష్యం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్ల బాగుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఏలూరి తెలిపారు. అలాగే మార్టూరు, ఇంకొల్లు, చిన్నగంజాం మండల కేంద్రాలలో నూతన అర్‌అంబ్‌బీ అతిథి గృహాలు నిర్మించాలని మంత్రిని ఏలూరి కోరారు. పర్చూరులో ఉన్న అర్‌అండ్‌బీ అతిథి గృహానికి మరమ్మతుల నిమిత్తం నిమిత్తం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.
Updated Date - Jul 02 , 2024 | 10:43 PM