ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూకబ్జాలపై విచారణ చేసుకోవచ్చు

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:52 PM

ఒంగోలులో భూకబ్జాలపై దమ్ముంటే విచారణ చేసుకోవచ్చని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రజాపోరాటం చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవలి సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకోవాలని అనుకున్నానని, ఒంగోలులో జరుగుతున్నవి చూశాక మళ్లీ కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

నా నిర్ణయం మార్చుకున్నా.. రాజకీయాలు విరమించుకోను..

రెండు నెలల తర్వాత ఒంగోలులో ఉంటా

నేను,నా కుమారుడు పారిపోయినట్లు ఫ్లెక్సీలు వేయించడం దుర్మార్గం

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 15 : ఒంగోలులో భూకబ్జాలపై దమ్ముంటే విచారణ చేసుకోవచ్చని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రజాపోరాటం చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవలి సాధారణ ఎన్నికల ఫలితాల అనంతరం తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకోవాలని అనుకున్నానని, ఒంగోలులో జరుగుతున్నవి చూశాక మళ్లీ కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టంచేశారు. స్థానిక లాయర్‌పేటలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఊహించలేదన్నారు. కౌంటింగ్‌ రోజున రిజల్ట్‌ చూ శాక తాను హైదరాబాద్‌ వెళ్లిపోయానని తెలిపారు. గత 25ఏళ్లు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. తాను, తన కుమారుడు పారిపోయినట్లు ఫ్లెక్సీలు వేయడం దుర్మార్గమన్నారు. ఆ ఫలితాలు అనంతరం వైసీపీ కార్యకర్తలను కొట్టడంతోపాటు అక్రమ కేసులు పెట్టారన్నారు. తాను ఎక్కడికి వెళ్లేది లేదని, మరో రెండు నెలలు వ్యక్తిగత పనులు ఉన్నాయని, అవి పూర్తిచేసుకొని ఒంగోలులోనే ఉంటానన్నారు. తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తనను హవాలా మంత్రి అని అన్నారని, ఆ ఘటనకు సంబంధించిన వ్యక్తి(నల్లమల్లి బాలు) ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారని, ఆ వ్యవహారం తేల్చాలని డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణుల స్థలం విషయంలో తనపై టీడీపీ అసత్య ఆరోపణలు చేసిందని, ఆ వివాదంలో ఉన్న వెంకటరెడ్డి, తన అండ చూసుకొని పెద్దిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలు చేశారని, ఇప్పుడు వారిద్దరు టీడీపీలోనే ఉన్నారన్నారు. అలా తన కుమారుడిపై కూడా ఆరోపణలు చేశారన్నారు. తన వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి విల్లాలు కడుతుంటే కొంతమంది అక్కడికి వెళ్లి దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ విల్లా నిర్మాణంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చని, కానీ అందుకు భిన్నంగా కొంతమందిని అక్కడకు పంపి దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. నెలరోజుల వ్యవధిలోనే ఒంగోలులో బిల్డర్లు, రియల్టర్లకు సుమారు 150మందికి నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒంగోలులో శిలాఫలకాలు ధ్వంసం చేయడం దుర్మార్గంగా ఉందన్నారు.

జిల్లాలో నాయకులకు కొదవలేదు

జిల్లాలో నాయకులకు కొదవవ లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నేతలకు జిల్లా గోడ్డుపోలేదని, అధ్యక్ష పదవి జిల్లాకు సంబంధించిన వ్యక్తులకే ఇవ్వాలన్నారు. చెవిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి విషయాన్ని తాను వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌ నుంచి వందేభారత్‌ రైలులో ఒంగోలు చేరుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మేయర్‌ గంగాడ సుజాత, పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ మాదాశి వెంకయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:52 PM

Advertising
Advertising
<