ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ వివాదాలు

ABN, Publish Date - Sep 14 , 2024 | 01:09 AM

దర్శి ప్రాంతంలో ఏళ్ల తరబడి భూములు, స్థలాల వివాదాలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో నిజమైన హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది వ్యవహరించిన ఆనుచిత వైఖరి భూ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. అప్పటి అధికారులు చేసిన పాపాలు బాధితుల పాలిట శాపాలుగా మారాయి.

దర్శి-కురిచేడు రోడ్డులోని వివాదాస్పద స్థలం

ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వైనం

గత వైసీపీ ప్రభుత్వంలో అధికారుల తీరుతో జటిలం

రికార్డులు తారుమారు చేసినట్లు ఆరోపణలు

దర్శి, సెప్టెం బరు 13 : దర్శి ప్రాంతంలో ఏళ్ల తరబడి భూములు, స్థలాల వివాదాలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో నిజమైన హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది వ్యవహరించిన ఆనుచిత వైఖరి భూ యజమానులకు ఇబ్బందికరంగా మారింది. అప్పటి అధికారులు చేసిన పాపాలు బాధితుల పాలిట శాపాలుగా మారాయి. అధికారులు ముడుపులు తీసుకొని రికార్డులు కూడా ట్యాంపరింగ్‌ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో విలువైన స్థలాలు, భూముల వివాదాల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగినా పరిష్కారంకాక కొంతమంది కోర్టులను కూడా ఆశ్రయించారు.

సమస్యను తీవ్రంచేసిన వైసీపీ నాయకులు

దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో రూ.2కోట్ల విలువైన పది సెంట్ల స్థలానికి సంబంధించిన వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అది మరింత జటిలమైంది. కొంతమంది వైసీపీ నాయకులు ఆ వివాదంలో చొరబడి సమస్యను తీవ్రం చేశారు. ఒక వ్యక్తి 15సంవత్సరాల క్రితం ఆ స్థల హక్కుదారుల నుంచి కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించున్నారు. అయితే అదే స్థలాన్ని పూర్వీకుల ద్వారా హక్కు ఉందని మూడేళ్ల క్రితం మరొకరు రిజిస్టర్‌ చేయించుకున్నారు. రెండోసారి చేయించుకున్న వారు పంచాయితీలో భాగంగా వైసీపీ నాయకులు ఉండటం గమనార్హం. ఈ వివాదంపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి కనిగిరి ఆర్డీవో జాన్‌ఇర్విన్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన స్థలాన్ని పరిశీలించి వెళ్లి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ పరిష్కారానికి నోచుకోలేదు.

హద్దుల విషయంలో వివాదం

దర్శి-కురిచేడు రోడ్డులో మరో స్థలం హద్దుల విషయంలో ఇద్దరి మధ్య ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. ఆ స్థలం తొలుత పూర్వీకుల హయాంలో సమాన భాగాలైంది. ఆతర్వాత కొనుగోలు చేసిన వారిలో ఒక వ్యక్తి దర్శి-కురిచేడు ప్రధాన రహదారి వైపు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. తనకు చేసిన రిజిస్ర్టేషన్‌లో కొలతల ప్రకారం స్థలానికి హద్దులు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతు న్నాడు. ఆ స్థలం పక్కన అందులో భాగమైన స్థలాన్ని కొనుగోలు చేసిన వారికి ప్రధాన రహదారి వైపు వెడల్పు తగ్గిపోయింది. దీంతో స్థలం విలువ తగ్గిపోవడంతో వివాదం ఏర్పడింది. ఈక్రమంలో వైసీపీకి చెందిన కొందరు పెద్దలు ఆ స్థలం వివాదాన్ని పరిష్కరిస్తామని రంగంలోకి దిగారు. ఒక వ్యక్తికి చెందిన స్థలాన్ని వారే కొనుగోలు చేసి అగ్రిమెంట్‌ కూడా రాసుకున్నారు. ఈ వివాదం కూడా నేటికీ పరిష్కారం కాలేదు.


మరికొన్ని గ్రామాల్లో..

రాజంపల్లిలో ఒక స్థలం వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇక్కడ ఇరువర్గాలు తమకంటే తమకు హక్కు ఉందని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్థలం విషయంలో ఒక వీఆర్వోపై కేసు కూడా నమోదైంది. అలాగే, బొట్లపాలెంలో ఒక స్థలం వివాద పరిష్కారం కోసం ఏళ్ల తరబడి బాధితుడు తిరుగుతున్నాడు. ఇప్పటివరకూ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.

కూటమి ప్రభుత్వం రాకతో ఆశలు

కూటమి ప్రభుత్వం రాకతో భూములు, స్థలాల సమస్యలు పరిష్కారమవుతాయని సంబంధిత వ్యక్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు బదిలీలపై వెళ్లారు. కొత్తగా వచ్చిన వారు తమకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మళ్లీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తీవ్రంగా మారిన భూములు, స్థలాల వివాదాలను తాజాగా వచ్చిన అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 02:06 AM

Advertising
Advertising