వైభవంగా వినాయక నిమజ్జనం
ABN, Publish Date - Sep 09 , 2024 | 11:34 PM
వినాయక చవతి నుంచి మూడురోజులుగా పూజలు అందు కున్న గణనాథులను సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు.
గిద్దలూరుటౌన్, సెప్టెంబరు 9 : వినాయక చవతి నుంచి మూడురోజులుగా పూజలు అందు కున్న గణనాథులను సోమవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. పట్టణంతోపాటు మండలం లోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన మండపాలలో కొలువుదీరిన గణనాథులకు విశేష పూజలు చేశారు. సోమవారం సాయంత్రం కే.ఎస్.పల్లె సమీపంలోని సగిలేరు నదిలో నిమజ్జనం చేశారు. అర్బన్ సీఐ కె.సురేష్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకం గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా వినాయకుని నిమజ్జనం
తర్లుపాడు : మండలంలో వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయ కుని విగ్రహాలు మూడోరోజు నిమజ్జనానికి తరలించారు. బొడిచర్ల వద్ద ఉన్న గుండ్ల కమ్మ వాగులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎస్‌ఐ పి.రాజ్‌కుమార్ పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
గిద్దలూరు : గణేష్ నవరాత్రుల్లో భాగంగా నవవస్త్ర గణపతి వద్ద, వాసవి అపార్ట్‌మెంట్‌లో ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. నిమ జ్జనం సందర్భంగా సగిలేరులోని కొన్ని ప్రాంతాల వద్ద నీటిప్రవాహం ఉండడంతో పోలీసులు ఆ ప్రాంతాలను తా త్కాలికంగా మూసివేశారు. మిగి లిన ప్రాంతాల్లో కొనసాగింది.
పొదిలి : వినాయక చవితి పండుగ సందర్భంగా మండ లంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలను మూడు రోజుల ప్రత్యేక పూజల అనంతరం సోమవారం నిమజ్జన కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించారు. మండపాల వద్ద భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు. స్వామివారికి సోమ వారం ప్రత్యేకపూజల అనంతరం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన కార్యక్రమంతో ఏర్పాటు చేసిన డీజేలు, సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహించారు. లడ్డూ పాటలు నిర్వహించి లడ్డు దక్కించుకున్న వారిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు.
కొమరోలు : మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని వినాయకుని ప్రతిమలను గ్రామోత్సవం నిర్వహించి చివరగా గణనాథుల వాహనాలు దేవాలయం వద్దకు వరుసగా వచ్చి అక్కడి నుంచి పెద్దచెరువుకు నిమజ్జనానికి తరలించారు. యువత ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొన్నారు. మండలంలోని మూలపల్లి గ్రామంలోని వినాయకుని లడ్డు ప్రసాదాన్ని రూ.66వేలకు దనిరెడ్డి కొండారెడ్డి దక్కించుకున్నారు. తాతిరెడ్డిపల్లి గ్రామంలో ని ఎస్సీకాలనీలో ఏర్పాటుచేసిన వినాయకుని లడ్డుప్రసాదాన్ని ఎంపీటీసీ సభ్యుడు తిరుపతిరాజు రూ.43,100లకు, స్థానిక వరసిద్ధి వినాయకుని దేవాలయంలో లడ్దుప్రసాదాన్ని కొమరోలు గ్రామానికి చెందిన నాగార్జున రూ.25 వేలకు, స్ధానిక సిమెంటుకొట్టు వెంకటరెడ్డి వినాయకుని లడ్డు ప్రసాదాన్ని సముద్రాల వెంకటేశ్వర్లు రూ.25వేలకు, స్థానిక శివాజినగర్‌లో రూ.9500 లకు జాజం నీలకంఠం, గోపానిపల్లి గ్రామంలో వర్రా.ఈశ్వరమ్మ రూ.18 వేలకు, మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో రూ.10,500లకు కదం వెంకటేశ్వర్లు దక్కించుకున్నారు. గణేశుని భక్తిపాటలతో యువత కేరింతలతో ఉల్లాసంగా నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. స్థానిక మఠంబజారులోని శ్రీవీరబ్రంహ్మంగారి మఠంలో వినాయకుని తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలను ధర్మకర్త వెంకటరమణ ఘనంగా నిర్వహించారు.
Updated Date - Sep 09 , 2024 | 11:34 PM