ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను సాగర్‌ నీటితో నింపుతాం

ABN, Publish Date - Aug 08 , 2024 | 11:22 PM

గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను సాగర్‌ నీటితో నింపుతామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం అద్దంకిలో పలు కార్య క్రమాలకు హాజరైన రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పూర్తి నిర్లక్షానికి గురైందని, గేట్లు కూడా కొట్టుకుపోయి 3 సంవత్సరాలు అయినా ఏర్పాటు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నారు.

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వసతుల కల్పన

మంత్రి గొట్టిపాటి

అద్దంకి, ఆగస్టు 8 : గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను సాగర్‌ నీటితో నింపుతామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. గురువారం అద్దంకిలో పలు కార్య క్రమాలకు హాజరైన రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పూర్తి నిర్లక్షానికి గురైందని, గేట్లు కూడా కొట్టుకుపోయి 3 సంవత్సరాలు అయినా ఏర్పాటు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యుద్ధప్రాతిపదిక మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీరు లేనందున సాగర్‌ డ్యామ్‌ నుంచి విడుదలయ్యే నీటితో 1.6 టీఎంసీలను నిల్వ చేస్తారన్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో వసతుల కల్పన

అద్దంకి పట్టణంలోని ప్రకాశం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి రవికుమార్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంత్రి రవికుమార్‌ పరిశీలించారు. ఒకేషనల్‌ స్టూడెంట్స్‌కు కంప్యూటర్‌ ల్యాబ్‌లో 10 కంప్యూటర్‌లు అవసరమని, విద్యార్థులకు డైనింగ్‌ హాల్‌, సరిపడా డ్యూయల్‌ డెస్క్‌లు కావాలని, ఆటస్థలానికి అడ్డంగా ఉన్న పాత భవనాలు, మట్టి తొలగించేలా చేయాలని ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు మంత్రి రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Aug 08 , 2024 | 11:22 PM

Advertising
Advertising
<