ఉద్యోగులకు అండగా ప్రభుత్వం
ABN, Publish Date - Aug 05 , 2024 | 12:45 AM
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఐదేళ్ల వైసీపీ పాలనను స్వస్తి చెప్పి టీడీపీకి పట్టం కట్టడంతో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యా యులకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.
కంభం, ఆగస్టు 4 : పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఐదేళ్ల వైసీపీ పాలనను స్వస్తి చెప్పి టీడీపీకి పట్టం కట్టడంతో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధ్యా యులకు ప్రభుత్వం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా సాగుతున్న రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆదివారం కంభంలోని బృందావన్ ఫంక్షన్ హాలులో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో తాను 21వ రౌండ్‌లో 301 ఓట్లు వెనుకబడి ఉన్నానన్నారు. తనకు వచ్చిన పోస్టల్ ఓట్లలో 66శాతంతో గెలుపును అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. అందుకు కారణమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తన విజయం అంకిత మన్నారు. తన గెలుపు మీదేనని భావోద్వేగంతో ప్రసంగించారు. గతంలో వైసీపీ ఇచ్చిన భూటకపు హామీలను నమ్మి పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చినట్లు జగన్‌కు రాష్ట్రాన్ని అప్పగించామన్నారు. అయితే ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు జరిగిన పొరపాటు సరిదిద్దు కొన్నారన్నారు. పరిపాలన అనుభవనం ఉన్న చంద్రబా బునాయుడు ముఖ్యమంత్రిని చేశారని, కూటమిలో భాగస్వామైన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సహకారం, దేశప్రధాని నరేంద్రమోడి తోడ్పాటుతో రాష్ట్రం అభివృద్ధిలో ముంద డుగు వేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఆటుపోట్లను దాటుకుని 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు, సామాజిక ఫించన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసేలా 175 జీవోను తీసుకు వచ్చిందన్నారు. ఆ జీవో ద్వారా పాఠశాలల విలీనంతో రాష్ట్రంలో 5 వేల పాఠశాలను మూసివేసినట్లు తెలిపారు. దీంతో పాటు ఆసక్మిక తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను మానసికంగా వేధించిందన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యావంతుడైన యువకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున ఉపాధ్యాయుల సమ స్యలు తొలగి పాఠశాలలు బాగు పడతాయన్నారు. వైసీపీ ప్రభు త్వంలో ప్రతి పథకానికి జగన్మో హన్‌రెడ్డి తన పేరును ముందు తగిలించుకొన్నాడన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యా హ్న పథకం పేరు పెట్టింన్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించామన్నారు. ‘నేను మీ కుటుంబసభ్యుడినని, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’ అని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను మూడు మండలాల సంఘాల వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు, జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి, కొత్తపల్లి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా ఎంపీడీవో రంగనాయకులు, కంభం ఎంపీడీవో మస్తాన్‌వలి, ఎంఈవోలు మాల్యాద్రి, అబ్దుల్‌సత్తార్, కాశయ్య, తురిమెళ్ళ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సోని, మాజీసర్పంచ్ నారిశెట్టి వీరమ్మ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తాటికొండ రామారావు పగడాల పాండు, ఎం.కేశవ, బీవీ.రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాసులు, మల్లికార్జున, గోన చెన్నకేశవులు, కేతం శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - Aug 05 , 2024 | 12:45 AM