ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్పీగా గరుడ్‌ సుమిత్‌

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:29 PM

జిల్లా ఎస్పీగా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన పి.పరమేశ్వరరెడ్డిపై బదిలీ వేటు వేసిన విషయం విదితమే. మహారాష్ట్రకు చెందిన డాక్టర్‌ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ప్రస్తుతం ఇంటెలిజెన్సీ విభాగంలో పనిచేస్తున్నారు.

వెంటనే బాధ్యతల స్వీకరణ

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 4: జిల్లా ఎస్పీగా గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన పి.పరమేశ్వరరెడ్డిపై బదిలీ వేటు వేసిన విషయం విదితమే. మహారాష్ట్రకు చెందిన డాక్టర్‌ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ప్రస్తుతం ఇంటెలిజెన్సీ విభాగంలో పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆయన సివిల్‌ సర్వీ్‌సలో 2015లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. 2018లో ఆరునెలలు పాటు జిల్లాలో ట్రైనీ ఐపీఎ్‌సగా శిక్షణ పొందారు. సత్యఏసుబాబు ఎస్పీగా పనిచేసిన సమయంలో శిక్షణ తీసుకున్న గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ చీమకుర్తి పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా పనిచేశారు. జిల్లాలో ఆరునెలల పాటు శిక్షణ పొందిన తర్వాత గ్రేహౌండ్స్‌ అసిస్టెంట్‌ కమాండర్‌గా విధులలో చేరారు. అనంతరం విశాఖపట్నం రేంజి పరిధిలో నర్సీపట్నం ఏఎస్పీగా, తూర్పుగోదావరి జిల్లా ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. శ్రీకాకుళం ఏఎస్పీగా, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా, విశాఖపట్నం డీసీపీగా , ఎస్‌ఐబీలో ఎస్పీగా విధులు నిర్వహించారు. తొలిసారిగా జిల్లా ఎస్పీగా భాధ్యతలు చేపట్టి ఎన్నికల నిర్వహణ పర్యవేక్షించనున్నారు.

బాధ్యతలు స్వీకరించిన సుమిత్‌

జిల్లా ఎస్పీగా నియమితులైన గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ గురువారం రాత్రికే బాధ్యతలు స్వీకరించారు. ఏఎస్పీ నాగేశ్వరరావు నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు సుపరిచితుడినేనని, శిక్షణ కాలంలో ఇక్కడ పనిచేయడం తనకు కలిసొచ్చే అవకాశమన్నారు. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 04 , 2024 | 11:29 PM

Advertising
Advertising