గుండ్లకమ్మ నదికి వరద
ABN, Publish Date - Sep 01 , 2024 | 10:16 PM
గుండ్లకమ్మ నదికి వరద నీటి ప్రవాహం బాగా పెరిగింది. గత రెండు రోజులుగా గుండ్లకమ్మ నది ఎగువ పరీవాహక ప్రాంతాలలో వర్షాలు, సాగర్ కాలువలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం ఆదివారం బాగా పెరిగింది. గత ఏడాది నుంచి గుండ్లకమ్మ నదికి ఇంతమేర వరద నీరు రాలేదు. సాగర్ నీరు కూడా విడుదల జరగడంతో ఇక గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం కొనసాగనుంది.
అద్దంకి, సెప్టెంబరు 1 : గుండ్లకమ్మ నదికి వరద నీటి ప్రవాహం బాగా పెరిగింది. గత రెండు రోజులుగా గుండ్లకమ్మ నది ఎగువ పరీవాహక ప్రాంతాలలో వర్షాలు, సాగర్ కాలువలకు పూర్తి స్థాయిలో నీటి విడుదల నేపథ్యంలో గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం ఆదివారం బాగా పెరిగింది. గత ఏడాది నుంచి గుండ్లకమ్మ నదికి ఇంతమేర వరద నీరు రాలేదు. సాగర్ నీరు కూడా విడుదల జరగడంతో ఇక గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం కొనసాగనుంది.
గుండ్లకమ్మ ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టు రైతు లు వరిసాగుకు సిద్ధమవుతున్నారు. పట్టణానికి కూడా తాగునీటి కష్టాలు తీరినట్లయింది. అద్దంకిలో ఆదివారం ఉదాయినికి 111.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సాయంత్రం వరకు కూడా వర్షపు జల్లులు పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు జల్లులు పడుతున్నాయి. ఆదివారం సాయం త్రం కొద్దిమేర ఎండ వచ్చినప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షపు జల్లులు పడుతుండడం ఆదివారం సెలవు కావడంతో అద్దంకి పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రెండు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలతో పొలాలలో నీరు నిలిచింది. వాగులకు నీరు చేరింది. బోరుబావుల కింద వరినాట్లు ముమ్మరం అయ్యాయి. నీటి వినియోగం లేకపోవటం తో సాగర్ కాలువ ల నిండా నీరు ప్రవహిస్తుంది.
నిండుతున్న వాగులు, చెరువులు
బల్లికురవ : నిన్న మెన్నటి వరకు చు క్కు నీరులేని చెరువులు, వాగులు భారీ వర్షాలతో నిండుతున్నాయి. మూడు రోజుల నుంచి మండలంలోని అన్ని గ్రామాల లో కురిసిన భారీ వర్షంతో బెట్ట కొచ్చిన మెట్ట పంటలు జీవం పోసుకున్నాయి. చుక్క నీరు లేని చెరువులు వాగులకు నీరు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. మండలంలోని గుంటుపల్లి, ముక్తేశ్వరం గ్రామాల మధ్య ఉన్న పరమడ వాగు నీటి ఉధృతి కొనసాగుతోంది. ఈ నీరు బల్లికురవ వీర్లచెరువుకు చేరుతుండడంతో చెరువు కళ కళలాడుతుంది. అంబడిపూడి సాగు నీటి చెరువు పూర్తి స్థాయిలో నిండుకుంది. చెన్నుపల్లి, చెరువు పూర్తి స్థాయిలో నిండింది. అలానే గంగపాలెం వేమవరం గ్రామాల మధ్య ఉన్న అక్కమ్మ కుంటలో మట్టిని తవ్వడంతో వర్షపు నీటితో పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బల్లికురవ మండలంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకున్న వర్షాలు ఇప్పటి వరకు పంటలకు ఎంతో ఉపయెగం అని రైతులు అంటున్నారు. ఇంకా వానలు పడితే పంటలకు నష్టమని వారు తెలిపారు.
Updated Date - Sep 01 , 2024 | 10:16 PM