ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడుగురికి ఎఫ్‌ఏసీ ఉత్తర్వులు

ABN, Publish Date - Jul 15 , 2024 | 10:21 PM

ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎంఈవో-1, ఆరుగురు గ్రేడ్‌-2 హెచ్‌ఎంల స్థానంలో ఏడుగురికి పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఒకరు ఎంఈవో, ఆరుగురు గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా నియామకం

ఒంగోలు(విద్య), జూలై 15 : ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎంఈవో-1, ఆరుగురు గ్రేడ్‌-2 హెచ్‌ఎంల స్థానంలో ఏడుగురికి పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ పాఠశాల విద్య గుంటూరు ఆర్‌జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పరిపాలన, జీతాల చెల్లింపుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ విరమణ చేసిన సింగరాయకొండ ఎంఈవో-1 స్థానంలో అక్కడి మూలగుంటపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.శ్రీనివాసరావును నియమించారు. పెదకండ్లగుంట జడ్పీ హైస్కూల్‌కు అదేపాఠశాలలో పనిచేస్తున్న గణితం స్కూల్‌ అసిస్టెంట్‌ వై.శ్రీనివాసులు, ఎం.నిడమానూరు జడ్పీ హైస్కూల్‌కు ఆ పాఠశాల పీఎస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఎం.కల్యాణి, మద్దులూరు జడ్పీ హైస్కూల్‌కు సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రభాకరరావులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మాగుటూరు జడ్పీ హైస్కూల్‌కు హిందీ స్కూలు అసిస్టెంట్‌ బి.వెంకటరమణ, పూసలపాడు జడ్పీ హైస్కూల్‌కు హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ షబ్బీర్‌ను, హెచ్‌ఎంపాడు జడ్పీ హైస్కూల్‌కు అక్కడి ఇంగ్లీషు టీచర్‌ బి.వి.సుబ్బా రావును ఇన్‌చార్జి హెచ్‌ఎంలుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Jul 15 , 2024 | 10:21 PM

Advertising
Advertising
<