ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన పరిశీలన

ABN, Publish Date - Apr 27 , 2024 | 01:03 AM

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో 48 నామినేషన్లు తిరస్కరణ, 158 ఆమోదం

ఒంగోలు పార్లమెంట్‌లో ఏడు తిరస్కరణ, 25 ఓకే!

జిల్లా ఎన్నికల అధికారి దినేష్‌కుమార్‌ వెల్లడి

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 26 : జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 18నుంచి 25వతేదీ వరకూ నామినేషన్లను స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 206 మంది అభ్యర్థులు 354 నామినేషన్లను దాఖ లు చేశారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారుల నేతృత్వంలో శుక్రవారం పరిశీలన జరిగిందన్నారు. 48 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. 158 మంది నామినేషన్లను ఆమోదించడం జరిగిందన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో 32 మంది అభ్య ర్థులు 62 సెట్ల నామినేషన్‌లను దాఖలు చేయగా, ఏడింటిని తిరస్కరించి నట్లు తెలిపారు. 25 మంది నామినేషన్లను ఆమోదించినట్లు చెప్పారు. ఈనెల 29వతేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉందన్నారు. 29వతేదీ సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 01:03 AM

Advertising
Advertising