ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అవినీతి, అక్రమాల్లో దిట్ట చెవిరెడ్డి

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:56 PM

ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అవినీతి, అక్రమాల్లో దిట్ట అని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా వెళ్తున్న సుధాకర్‌రెడ్డి

స్థానికేతరుడైన ఆయన్ను ఓడించాలి

ఒంగోలు ఎంపీ స్థానంలో రెడ్ల ఆధిపత్యం పోతుందనే మార్కాపురం జిల్లా చేయలేదు

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి

ఒంగోలు (కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 25 : ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అవినీతి, అక్రమాల్లో దిట్ట అని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయనపై అనేక భూకబ్జాలు, ఎర్రచందనం కేసులతోపాటు లెక్కకుమిక్కిలి ఆరోపణలున్నా యన్నారు. ఎక్కడో 300 కి.మీ దూరంలో ఉండే వ్యక్తికి వైసీపీ ఒంగోలు లోక్‌సభ స్థానం కేటా యించడం వెనుక అనేక కారణాలున్నాయని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన అనం తరం సుధాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘చెవిరెడ్డి జిల్లా వాసి కాదు. ఏ నియోజకవర్గం ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలియదు. వందల కి.మీ దూరం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేందుకు ఆయనకు ఏం అర్హత ఉంది? అని ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో భూకబ్జాలతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తికి ఏవిధంగా ఎంపీ టికెట్‌ ఇస్తారని ప్రశ్నించారు. చెవిరెడ్డిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే రెడ్ల ఆధిపత్యం పోతుందని కొందరు అడ్డుకుని పశ్చిమ ప్రాంతప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని సుధాకర్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:56 PM

Advertising
Advertising