ఎస్పీగా దామోదర్
ABN, Publish Date - Jul 14 , 2024 | 01:10 AM
జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్‌ను నియమిస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో 37మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుతం ఎస్పీగా ఉన్న గరుడ్ సుమిత్ సునీల్‌ను హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఆదేశిస్తూఆయన స్థానంలో నూతన ఎస్పీగా దామోదర్‌ను నియమించింది.
మున్నా గ్యాంగ్‌కు ముకుతాడు వేసిన అధికారి
సుమిత్ సునీల్ హెడ్ క్వార్టర్‌కు బదిలీ
ఒంగోలు (క్రైం), జూలై 13 : జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్‌ను నియమిస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో 37మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుతం ఎస్పీగా ఉన్న గరుడ్ సుమిత్ సునీల్‌ను హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఆదేశిస్తూఆయన స్థానంలో నూతన ఎస్పీగా దామోదర్‌ను నియమించింది. ప్రస్తుతం ఒంగోలు పోలీస్ శిక్షణ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న దామోదర్ పోలీస్ శాఖలో 2007లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2008లో జిల్లాలోనే ప్రొబేషరీ డీఎస్పీగా పనిచేశారు. అప్పట్లో తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వర్తిస్తూ హైవే కిల్లర్ మున్నా నిశ్శబ్ద హత్యాకాండను బట్టబయలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచారు. ఆ గ్యాంగ్‌లో 12 మందికి ఉరిశిక్ష పడటం గమనార్హం. ఉద్యోగోన్నతి పొంది విజయనగరం ఎస్పీగా 2019 ఎన్నికల సమయంలో అద్భుత పనితీరు కనబర్చారు. ఎస్పీ దామోదర్ పరిణితి చెందిన అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు పొందారు. శిక్షణ కాలంలోనే జిల్లాలో ఆరు నెలలపాటు పనిచేయడంతోపాటు 2021 నుంచి ఇప్పటివరకు ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయనకు జిల్లా సమస్యలతోపాటు అన్ని పరిస్థితులపై అవగాహన, పట్టు ఉంది. ఇప్పటివరకు జిల్లాలో వంద రోజులపాటు పనిచేసిన గరుడ్ సుమిత్ సునీల్‌ను హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Updated Date - Jul 14 , 2024 | 01:10 AM