ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కానిస్టేబుల్‌ వేణు సస్పెన్షన్‌?

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:11 AM

కానిస్టేబుల్‌ వేణు ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత కూడా విధులకు గైర్హాజరు కావడంతో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌సునీల్‌ సీరియస్‌ అయ్యారు. అతనిపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. అతను ఈ నెల 3 నుంచి విధుల్లో లేడని, పోలీసుస్టేషన్‌ జనరల్‌ డైరీ ప్రకారం సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ నివేదక ఇచ్చారు.

ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపిన ఎస్పీ

ఈ నెల 3 నుంచి విధులకు గైర్హాజరంటూ ఫైల్‌

ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 26 : కానిస్టేబుల్‌ వేణు ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత కూడా విధులకు గైర్హాజరు కావడంతో ఎస్పీ గరుడ్‌ సుమిత్‌సునీల్‌ సీరియస్‌ అయ్యారు. అతనిపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు. అతను ఈ నెల 3 నుంచి విధుల్లో లేడని, పోలీసుస్టేషన్‌ జనరల్‌ డైరీ ప్రకారం సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ నివేదక ఇచ్చారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి అనుమతులు లేకుండా 21 రోజులు విధులకు గైర్హాజరు కాకూడదు. సీఐ ఇచ్చిన నివేదకను ఎస్పీ పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీంతో కానిస్టేబుల్‌పై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి సేవలో వేణు తరిస్తుండడం జగమెరిగిన సత్యం. అతను ఇప్పటికీ యూనిఫాం లేకుండా ప్రణీత్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వేణు విధులకు గైర్హాజరవుతున్నాడు అనేది పోలీసు అధికారులందరికీ తెలిసిన విషయమే. దీనిని ఎవరూ ప్రశ్నించేందుకు సాహసించలేకపోయారు. వేణు విధులకు గైర్హాజరుపై ఆంధ్రజోతి దినపత్రికలో కథనం రావడంతో అప్పుడు స్పందించారు. ఈ క్రమంలో టంగుటూరు పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌చార్జి సీఐ ఈ నెల 3 నుంచి కానిస్టేబుల్‌ వేణు విధులకు గైర్హాజరయ్యాడు అని నివేదక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆశాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఐ రంగనాథ్‌ ఈనెల 3 నుంచి ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నప్పటికీ, కానిస్టేబుల్‌ వేణు అంతకుముందు పోలీసుస్టేషన్‌లో ఎలాంటి విధులు నిర్వహించాడు అనేది జనరల్‌ డైరీ పరిశీలిస్తే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎస్పీ కోరిన మేరకు ఈనెల 3 నుంచి విధులకు గైర్హాజరైనట్లు సీఐ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించారు. నేడోరేపో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Apr 27 , 2024 | 12:11 AM

Advertising
Advertising