ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రామోజీరావుకు టీడీపీ నేతల సంతాపం

ABN, Publish Date - Jun 08 , 2024 | 11:16 PM

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివదేహానికి శనివా రం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీరా భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న గొట్టిపాటి

గొట్టిపాటి నివాళి

అద్దంకి, జూన్‌ 8 : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్ధివదేహానికి శనివా రం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ నివాళుల ర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సినీ, పత్రికారంగంలో చెరగని ముద్ర : ఏలూరి

పర్చూరు : ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీ రావు మృతి పట్ల పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. సినీ, పత్రికా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివాన్నారు. తెలుగువారి సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటిన రామోజీరావు చిరస్మరణీయులని ఏలూరి కొనియాడారు. జనహితమే తన అభిమతంగా కృషి చేశారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూమితిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఇంకొల్లు టీడీపీ కార్యా లయంలో రామోజీరావు మృతికి శ్రేణులు సం తాపం తెలిపాయి.

కారంచేడు : బహుముఖ ప్రజ్ఙాశాలి, ప్రజా పక్షపాతి అలుపెరగని ఆక్షర యోధుడు పద్మ విభూషన్‌ చెరుకూరి రామోజీరావుకు కారంచేడు టీడీపీ నాయకులు శనివారం ఘన ని వాళి అర్పించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ప్రాణాలు, సుబ్బారావు, చాగంటి కోటేశ్వరరావు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మార్టూరులో..

మార్టూరు : రామోజీరావు మృతి పత్రికా ప్రపంచానికే తీరనిలోటు అని టీడీపీ మం డల నాయకులు అన్నారు. రామోజీరావు మృ తి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తాటి నాగేశ్వరరావు, శ్రీను, శివనాగేశ్వరరావు, ఆంజనేయులు, సకల ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, భుజంగరావు జంపని సాంబశివరావు పాల్గొన్నారు. యద్దనపూడి మండలం పూనూరు, గన్నవరం గ్రామాలలో రామోజీ మృతిపట్ల నాయకులు సంతాపం తెలిపారు. గ న్నవరంలో చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. రంగయ్యచౌదరి, సతీష్‌కుమార్‌, సోమేపల్లిబాబు, నరసింహారావు, ప్రత్తిపాటి రామకృష్ణ, అబ్బిరెడ్డి, పున్నారావు, కాజావలి పాల్గొన్నారు.

చీరాల : రామోజీరావు అస్తమయం తీరనిలోటని మాజీ ఎంపీ చిమటా సాంబు అన్నారు. ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Read more!

Updated Date - Jun 08 , 2024 | 11:16 PM

Advertising
Advertising