ఎనిమిది మంది డీటీలకు అడ్‌హక్ ప్రమోషన్లు
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:57 AM
జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు. వారికి తహసీల్దార్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు.
కలెక్టర్ అన్సారియా ఉత్తర్వులు
ఒంగోలు(కలెక్టరేట్), ఆగస్టు 23 : జిల్లాలో పనిచేస్తున్న ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లకు అడ్‌హక్ ఉద్యోగోన్నతులు కల్పించారు. వారికి తహసీల్దార్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈమేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టరేట్‌లోని పీఎస్‌వీపీ డీటీగా పనిచేస్తున్న పి.మురళిని కొండపి, మార్కాపురంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా పనిచేస్తున్న జి.ఆంజనేయులును టంగుటూరు తహసీల్దార్‌గా నియమించారు. పొదిలిలో రీసర్వే డీటీగా పనిచేస్తున్న కె.శాంతిని దోర్నాల, వెలిగండ్లలో డీటీగా పనిచేస్తున్న సిహెచ్.నాగార్జునరెడ్డిని మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయ కేఆర్‌సీసీ స్పెషల్ తహసీల్దార్‌గా, నెల్లూరు జిల్లా కందుకూరు తహసీల్దార్ ఆఫీసు డీటీ బి.జనార్దన్‌ను జరుగుమల్లి, మార్కాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ డీటీగా పనిచేస్తున్న డి.భాగ్యలక్ష్మిని కొమరోలు తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చీమకుర్తిలో డీటీగా పనిచేస్తున్న బి.సత్యసాయి శ్రీనివాసరావును కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా, వైపాలెం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా పనిచేస్తున్న ఎ.జితేంద్రకుమార్‌ను బేస్తవారపేట తహసీల్దార్‌గా, కలెక్టరేట్‌లో సూపరింటెం డెంట్‌గా పనిచేస్తున్న టి.రవిని సింగరాయకొండ తహసీల్దార్‌గా నియమించారు.
ఇద్దరు తహసీల్దార్ల బదిలీ
జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దోర్నాల తహసీల్దార్‌గా పి.బాలాజీ విశ్వనాథ్‌ను కనిగిరి ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమించారు. మార్కాపురం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కేఆర్‌సీసీ స్పెషల్ తహసీల్దార్‌గా పని చేస్తున్న కె.దాసును అర్ధవీడు తహసీల్దార్‌గా బదిలీ చేశారు.
Updated Date - Aug 24 , 2024 | 12:58 AM