మత్స్యకారుల జీవనోపాధికి గండి
ABN, Publish Date - Aug 03 , 2024 | 10:07 PM
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేం దుకు ఏర్పాటుచేసిన సొసైటీలు వారి ఆశయానికి గండి కొడుతున్నాయి. చెరువులను ఏర్పాటుచేసి చేపలు పెంచు కునేందుకు వీలుగా సొసైటీలను ఏర్పాటుచేశారు.
పేరుకే సొసైటీ చెరువులు
చేపలు పెంచుకునేది వ్యాపారులు
ముడుపులు తీసుకొని
సహకరిస్తున్న అధికారులు
ఒట్టిపోయిన చెరువులు
నీరులేక జీవాలు విలవిల
దర్శి, ఆగస్టు 3: మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేం దుకు ఏర్పాటుచేసిన సొసైటీలు వారి ఆశయానికి గండి కొడుతున్నాయి. చెరువులను ఏర్పాటుచేసి చేపలు పెంచు కునేందుకు వీలుగా సొసైటీలను ఏర్పాటుచేశారు. అయి తే, ఇవి పేరుకు మాత్రమే మత్స్యకారుల సొసైటీలు. చేప లు పెంచుకునేది మాత్రం వ్యాపారులు. నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులను లోబర్చుకొని వ్యాపారులు ఇ ష్టారాజ్యంగా సొసైటీ చెరువుల్లో చేపలు పెంచుకొని వ్యా పారం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లే దు. ముడుపులు తీసుకొని వ్యాపారులకు సహకరిస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులు బడాబాబులకు ఎదురుచెప్పలేక వారిచ్చిన కొద్దిపాటి సొమ్ము తీసుకొని సర్ధుకుంటున్నారు.
దర్శి మండలంలోని పోతకమూరు, తూర్పువీరాయ పాలెం, ముండ్లమూరు మండలంలోని పులిపాడు, ఉల్లగ ల్లు చెరువులను ఒక సొసైటీగా ఏర్పాటుచేశారు. ఈ నా లుగు చెరువులను పులిపాడు మత్స్యకారుల సొసైటీ పరి ధిలోకి చేర్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నాలుగు చెరువులు రికార్డుల ప్రకారం మత్స్యకారుల ఆధ్వర్యంలో చేపల పెంపకం జరుపుతున్నట్లు లెక్కలు రాశారు. వాస్తవంగా నర్సరావుపేటకు చెందిన ఒక చేపల వ్యాపారి ఈ చెరువుల్లో చే పలు పెంచుకుంటున్నారు. గత వైసీపీ ప్రభు త్వం అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో ఆ వ్యాపారి చేపల చెరువుల్లో చేపలు పెంచుకొని విక్రయిం చుకున్నాడు. మ త్స్యశాఖ అధికారుల లెక్కల్లో మాత్రం సొసైటీ సభ్యులు చేపలు పెంచుకు న్నట్లు రికార్డులు రాశారు. ఆ వ్యాపారి వైసీపీ ప్రజాప్రతినిదులకు ముడు పులు ఇచ్చి తనకు అనుకూలంగా మలుచుకున్నా డు. నిబంధనల ప్రకారం సొ సైటీలకు ప్రతి ఏడాది మత్స్య శాఖ అధికారులు చేపలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధం గా ఆ వ్యాపారి సొసైటీ సభ్యు ల పేర్లతో ఎప్పటికప్పుడు సం తకాలు చేయించుకొని వారే చెరువులు తీసుకున్నట్లు వ్యవ హారం నడిపారు. అదేక్రమం లో ఈ ఏడాది కూడా చేప పిల్లలు వేసుకోవాలనే ఉద్దే శంతో పొతకమూరు చెరువు చుట్టూ కంచె వేశాడు. చెరువుకు నీరు రాగానే చేప పిల్లలు వేసేందుకు సన్నద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పొతకమూరు పంచాయతీలోని నాయకులు ఆ వ్యాపారి ని అడ్డుకున్నారు. సొసైటీ చెరువులో మీకేం పని అని ప్రశ్నించటంతో ప్రస్తుతానికి మిన్నకుండిపోయాడు. ఈవి షయంపై మత్స్యకారుల అధికారులను వివరణ కోరగా.. మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలోనే చేప పిల్లలను వేసి పెంచుకోవాల్సి ఉందన్నారు. వ్యాపారులు చేపలు పెంచు కునే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చ ర్యలు తీసుకుంటామన్నారు.
నీటిని వెళ్లబెట్టిన వ్యాపారులు
నిబంధనలకు విరుద్ధంంగా సొసైటీ చెరువుల్లో వ్యా పారులు చేపలను పెంచుకోవటమే కాక పట్టుకునే సమ యంలో నిల్వ ఉన్న నీటిని వదిలేశారు. పొతకమూరు చెరువులో చేపలు పట్టుకునేందుకు రెండు నెలల క్రితం తూములు ఎత్తి వదిలేశారు. దీంతో ఆ చెరువు వట్టిపోయింది. ఆ ప్రాంతంలోని పశువులు, గొర్రెలు మేకలు తాగునీటి కోసం నీరు లేక ఇబ్బంది పడుతున్నాయి. మిగిలిన చెరువుల్లో కూడా చేపలు పట్టే సమయంలో నీటిని వదిలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకో కపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావ టంతో ఇప్పుడైనా నిబంధనలకు అనుగుణంగా చేపల పెంపకం జరిగే విధంగా చూడాలని ప్రజలు డి మాండ్ చేస్తున్నారు.
Updated Date - Aug 03 , 2024 | 10:07 PM