ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోకేశ్‌ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన ప్రజలు

ABN, Publish Date - Jul 31 , 2024 | 02:44 AM

గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాక కష్టాలు, కన్నీళ్లుతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌ భరోసా ఇస్తోంది.

20వ రోజూ భారీగా విచ్చేసిన అర్జీదారులు

తాడేపల్లి, జూలై 30: గత ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం కాక కష్టాలు, కన్నీళ్లుతో కాలం వెళ్లదీసిన బాధితులకు మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌ భరోసా ఇస్తోంది. ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఆయన.. అప్పటికప్పుడు పలు సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీంతో జనం కొండంత ఆశతో ప్రజాదర్బార్‌కు తరలివస్తున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో మంగళవారం 20వ రోజు కూడా ప్రజాదర్బార్‌కు పోటెత్తారు. వారందరి నుంచీ ఆయన అర్జీలు స్వీకరించారు. పలువురు దివ్యాంగుల వద్దకు తానే వెళ్లి ఆప్యాయంగా పలుకరించి.. చేతిలో చేయి వేసి మాట్లాడారు. అర్జీలు తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

విశాఖ మధురవాడలో నేషనల్‌ హైవే 5, బీచ్‌ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని.. తగిన నష్టపరిహారం ఇప్పించాలని మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన మొవ్వ చంద్రశేఖర్‌రావు, పొట్లూరి గౌతం, కావూరి నరసింహారావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురానికి చెందిన ఇరుగుదిండ్ల నాగమ్మ లోకేశ్‌ను కలిసి.. గ్రామంలో దశాబ్దాలుగా తన భర్తపేరుపై ఉన్న 5 ఎకరాల 73 సెంట్ల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చర్యలు తీసుకుంటానని మంత్రి భరోసా ఇచ్చారు.

కర్నూలు జిల్లా గుండ్లకొండలో 2014-19 మధ్య అంగన్‌వాడీ పాఠశాల భవనం, సీసీరోడ్డు, ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించానని.. వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని.. ప్రజా ప్రభుత్వంలోనైనా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని వడ్డే తిరుపాలు అభ్యర్థించారు.

ఆర్‌టీసీలో విజిలెన్స్‌ సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తమకు 11వ వేతన సవరణ ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీఎ్‌సఆర్‌టీసీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటి స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన హేమలత... 17ఏళ్ల తన కుమారుడు 2నెలల కింద అదృశ్యమయ్యాడని ఎంత వెతికినా జాడ లేదని కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రజాదర్బార్‌కు ఆర్రోజులు సెలవు

బుధవారం నుంచి ఆగస్టు 5 వరకు ప్రజాదర్బార్‌ నిర్వహించడం లేదని లోకేశ్‌ కార్యాలయం ప్రకటిం చింది. తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ ఒక రోజు ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.

Updated Date - Jul 31 , 2024 | 02:44 AM

Advertising
Advertising
<