ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా నిజం!

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:00 AM

కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ప్రజా పంపిణీ పథకానికి(పీడీఎస్‌) సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించిన మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ తెలిపారు.

కాకినాడ పోర్టు నుంచి 750 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి: కలెక్టర్‌

కలెక్టరేట్‌(కాకినాడ), జూలై 12: కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి ప్రజా పంపిణీ పథకానికి(పీడీఎస్‌) సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించిన మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రూ.750 కోట్ల విలువైన బియ్యం ఎగుమతి అయినట్లు గుర్తించామన్నారు. ఏడాదికి రూ.150 కోట్ల విలువైన బియ్యం చొప్పున విదేశాలకు అక్రమార్కులు తరలించారని తెలిపారు. ప్రధానంగా ఆఫ్రికా దేశాలకు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి తరలించినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు వద్ద చెక్‌పోస్టు పెట్టి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రేషన్‌ బియ్యం తరలింపులో పాత్రధారులైన 13 మందిపై ‘6ఏ’ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - Jul 13 , 2024 | 07:35 AM

Advertising
Advertising
<