ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్‌డీఏ కూటమికే మా మద్దతు

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:57 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. రాష్ట్ర భవిష్యత్తు, బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, యువజన

బీసీల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు కోసమేశ్రీ

వైసీపీ పాలనలో బీసీల అభివృద్ధి శూన్యం

ఏపీ బీసీ సంక్షేమ సంఘం సమావేశం తీర్మానం

గుంటూరు, ఏప్రిల్‌ 14: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. రాష్ట్ర భవిష్యత్తు, బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, గౌరవాధ్యక్షుడు నిమ్మల శేషయ్య నేతృత్వంలో గుంటూరులో సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో విధులు, నిధుల్లేని కార్పొరేషన్‌ పదవులతో బీసీల అభివృద్ధి శూన్యమైందన్నారు. సమర్ధుడైన బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రవిచంద్రకు ఏడు నెలలుగా సరైన పోస్టింగ్‌ లేదన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజశేఖర్‌కు కూడా సరైన ప్రాఽధాన్యం కలిగిన పోస్టింగ్‌ లేకుండా చేశారని మండిపడ్డారు. బదిలీలు, పదోన్నతుల్లో కూడా బీసీ అధికారులకు అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. సమావేశంలో సంఘం నేతలు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, తన్నీరు ఆంజనేయులు, కన్నా మాష్టారు, కోలా కిశోర్‌, కొల్లూరు హనుమంతరావు, బ్రహ్మానందశర్మ, ఆర్‌కే యాదవ్‌, సోమరాజు, పారేపల్లి మహేష్‌, బలగాని ఆంజనేయులు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 02:57 AM

Advertising
Advertising