ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒక్కటే రాయి.. మూడు గాయాలు

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:50 AM

ఒక రాయితో రెండు కళ్లు, ఒక కాలికి గాయం కావడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి సంఘటనలో జరిగింది’ అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో

ఇది ప్రపంచలోనే అరుదైన ఘటన: ఆనం రమణారెడ్డి

అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘ఒక రాయితో రెండు కళ్లు, ఒక కాలికి గాయం కావడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి సంఘటనలో జరిగింది’ అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఒక రాయి ముందు జగన్‌రెడ్డి కంటి పైన తగిలి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కంటి దగ్గర కూడా తగిలింది. అక్కడ నుంచి కిందకు వెళ్లి జగన్‌ కాలినీ గాయపర్చింది. సీఎం కార్యాలయం విడుదల చేసిన ఫొటోల్లో ఆయన కంటిపైన, కాలికి కూడా బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రజలు దీని గురించి చర్చిస్తున్నారు. ప్రజల్లో సానుభూతి పుట్టించడం కోసం ఐ ప్యాక్‌ సహకారంతో తాడేపల్లి ప్యాలెస్‌ ఈ నాటకాన్ని రచించింది. సీఎం సతీమణి భారతి సాధారణంగా బయట కనిపించరు. కాని ఈ దాడి ఘటనకు కొద్ది గంటల ముందు తాడేపల్లి వద్ద రోడ్డు మీదకు వచ్చి బస్సు యాత్రలో ఉన్న జగన్‌కు చేయి ఊపారు. ఆ వెంటనే ఈ సంఘటన జరగడం... ఇదంతా ముందస్తు ప్రణాళిక అని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఇస్తోంది. ఈ డ్రామాలో జగన్‌ మీడి యా తన వంతు పాత్ర పోషించింది. ఒక చిన్న రాయితో జగన్‌ పై ఏకంగా హత్యాయత్నం జరిగిందని పెద్ద శీర్షిక, ఫొటోలు పెట్టి వండి వార్చింది. ఈ ఎన్నికల సమయంలో వైఎస్‌ కుటుంబానికి ఏదో ఒకటి జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని మేం పోలీసులకు ముందే మొర పెట్టుకొన్నాం. ఇతర దేశాల నిఘా సంస్థలు కూడా జగన్‌కు ప్రమాదం పొంచి ఉందని తమకు సమాచారం ఇచ్చాయని పోలీసులు చెప్పారు. ఇంత సమాచారం ఉంటే డీజీపీ ఏం చేస్తున్నారు? ఆయన ఏం భద్రతా చర్యలు తీసుకొన్నారు? ఆయన కూడా ఈ డ్రామాలో భాగస్వాములు అయ్యారా..!’ అని ఆనం ప్రశ్నించారు. ఇది ఇంతటితో ఆగుతుందని తాము అనుకోవడం లేదని, ఇంతకంటే ఘోరాలకు ప్రణాళికలు రచిస్తున్నారన్న అనుమానాలు తమకు ఉన్నాయని అన్నారు. ‘వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీత, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ప్రమాదం పొంచి ఉంది. వారిపై దాడి చేయించి దానిని చంద్రబాబుపై నెట్టే అవకాశం ఉంది. పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉం డా లి’ అని ఆనం డిమాండ్‌ చేశారు. జగన్‌పై దాడి జరిగిన ఐదు నిమిషా ల్లో వలంటీర్లు ఇంటింటికి తిరిగి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేశారని, వా రిని అంత వాయు వేగంతో ఎలా తిప్పగలిగారని ఆనం సందేహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 15 , 2024 | 02:50 AM

Advertising
Advertising