ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

ABN, Publish Date - Sep 03 , 2024 | 03:39 AM

శ్రీశైలం జలాశయానికి సోమవారం కూడా వరద ప్రవాహం భారీగా కొనసాగింది.ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు,

నాగార్జున సాగర్‌కు పోటెత్తుతున్న ప్రవాహం

శ్రీశైలం/వీపీ సౌత్‌, నరసరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి సోమవారం కూడా వరద ప్రవాహం భారీగా కొనసాగింది.ఎగువ పరివాహక ప్రాంతాలు జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 4,479 క్యూసెక్కులు మొత్తం 3,25,284 వరద నీరు వస్తోంది. డ్యాం 10 క్రస్టుగేట్లను ఎత్తి 4,71,730 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. ్ఢ26 గేట్లను ఎత్తి 5,40,656 క్యూసెకుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్ధాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 586.80 అడుగులకు చేరింది. దిగువన పులిచింతలకు5,43,070 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5,43,433 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

టీబీ డ్యాంలో 98 టీఎంసీలు

బళ్లారి సిటీ, సెప్టెంబరు 2: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం గరిష్ఠ నిల్వకు చేరువవుతోంది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 98.101 టీఎంసీలు ఉంది. జలాశయంలోకి 30,031 క్యూసెక్కుల వరద చేరుతోంది. ఔట్‌ఫ్లో 15,237 క్యూసెక్కులు.

Updated Date - Sep 03 , 2024 | 07:43 AM

Advertising
Advertising