ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి తరగతికి ఒక టీచర్‌

ABN, Publish Date - Aug 07 , 2024 | 03:52 AM

‘పాఠశాల విద్యా రంగం దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ మోడల్‌ను రూపొందించాలి.

ఆ మేరకు సర్దుబాటు జరగాలి: మంత్రి లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘పాఠశాల విద్యా రంగం దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ మోడల్‌ను రూపొందించాలి. కేవలం చదువులోనే కాకుండా విద్యార్థులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రోత్సహించేలా మోడల్‌ ఉండాలి’ అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యపై నిర్వహించి సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలి. కేజీబీవీల్లో బోధనా సిబ్బందిని పూర్తి పారదర్శకంగా, విద్యా ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి. ప్రతి పాఠశాలలో ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్‌ ఉండేలా టీచర్ల సర్దుబాటు చేయాలి. పాఠశాలలకు అక్రెడిటేషన్‌ కోసం ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం చేయాలి. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. ప్రతి విద్యార్థికి ఒక యునిక్‌ ఐడీ నంబరు ఇవ్వాలి. గురుపూజోత్సవం రోజున వంద మంది టీచర్లను సన్మానిస్తాం’ అని లోకేశ్‌ అన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు కోన శశిధర్‌, విజయరామరాజు, కృతిక శుక్లా, బి.శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 07:37 AM

Advertising
Advertising
<