ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: వైసీపీలో కొవ్వూరు ఎమ్మెల్యే సోదరుడి ఆడియో రచ్చ.. ఏకంగా సొంత అన్నపైనే...

ABN, Publish Date - Jan 19 , 2024 | 11:32 AM

Andhrapradesh: కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. సొంత అన్నపైనే విమర్శలు గుప్పిస్తూ కొవ్వూరు ఎమ్మెల్యే సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆడియో వైసీపీలో పెను దుమారాన్ని రేపింది.

నెల్లూరు, జనవరి 19: కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (nallapareddy prasanna kumar reddy) సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డి స్థానిక వైసీపీలో (YCP) కలకలం రేపారు. తన అన్న వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, దయచేసి తన అన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. సొంత అన్నపైనే ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజేంద్రకుమార్ రెడ్డికి (Rajendrakumar reddy) సంబంధించిన ఆడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆడియో వైసీపీలో పెను దుమారాన్ని రేపుతోంది.


ఇంతకీ ఆడియోలో ఏముందంటే...

‘‘మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డి వల్ల వైసీపీ చాలా నష్టపోయింది. ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించడం వల్ల వర్గ విభేదాలు పెరిగిపోయాయి. పార్టీ జెండాలని భుజాన మోసిన సామాన్య కార్యకర్తలు, నేతలు నలిగిపోతున్నారు. ప్రసన్న కనీసం వారిని కలవడం లేదు. ప్రసన్న అహం వల్ల గతంలో రెండు సార్లు ఓడిపోయారు. మళ్లీ అదే అహం ప్రదర్శిస్తున్నారు. సొంత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములపై అక్కసు వెళ్లగక్కుతున్నారు‌. దయచేసి మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని జగన్‌ను వేడుకుంటున్నాం’’ అంటూ ఆడియోలో రాజేంద్రకుమార్ తమ ఆవేదనను వెలిబుచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 19 , 2024 | 11:39 AM

Advertising
Advertising