ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Somireddy: కాకాణి జీవితం నకిలీ.. అబద్దాలతో కూడుకున్నదే

ABN, Publish Date - Feb 17 , 2024 | 03:45 PM

Andhrapradesh: కృష్ణపట్నం పోర్ట్ మూతపడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కాకాణి కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడుతాను అని ప్రకటన చేశారని అన్నారు.

నెల్లూరు, ఫిబ్రవరి 17: కృష్ణపట్నం పోర్ట్ మూతపడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడుతాను అని రాష్ట్ర మంత్రి కాకాణి స్వయంగా ప్రకటన చేశారని గుర్తుచేశారు. కాళీ కంటైనర్ వెజల్ పోర్టుకు వచ్చిందని.. వచ్చిన షిప్ ట్రాన్షిప్‌మెంట్ వెజల్ మాత్రమే అని తెలిపారు. కృష్ణపట్నం పోర్ట్ వాళ్లు అధికారికంగా పోర్ట్‌ను మూసేశామని తెలుపుతున్నారని.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఐస్ గెట్ ద్వారా కాళీ కాంటైనర్స్ అని తెలిపిందన్నారు. కృష్ణపట్నం పోర్ట్ మూతపడటంతో చెన్నై నుంచి ఎగుమతి చేస్తూ రైతులు నష్టపోతున్నారని టీడీపీ నేత తెలిపారు.

‘‘కాకాణి జీవితం నకిలీ.. అబద్దాలతో కూడుకున్నదే. కృష్ణపట్నం ఎదావిధిగా ఉంటుందని అదాని చెపితే నమ్ముతాం.. విలువలు లేని వ్యక్తికి కాకాణికి మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్ది.. పోర్ట్ తరలిపోతే రాజీనామా చేస్తానన్న కాకాణి మాట మీద నిలబడాలి.. కృష్ణపట్నం పోర్టు మీద అదాని నిర్ణయం తీసుకుంటే మూడు జిల్లాల ప్రజల జీవితాలు బాగుపడుతాయి.. జగన్ మానస పుత్రిక సాక్షిలో నా మీద సగం పేజీ వార్త రాశారు.. సాక్షి పేపర్లో పోర్టు తరలిపోదు అని వార్త రాస్తే నేను నమ్ముతాను.. అఖిలపక్షం, మీడియాతో మేము పోర్టులోకి వెళ్తుంటే అడ్డుకున్నారు.. కాకాణికి రెడ్ కార్పేట్ పరుస్తారా. పోర్ట్ ప్రాంతంలో కార్గో వలన రైతులు నష్టపోతున్నారు, ఉప్పు రైతు నష్టపోయారు. కాకాణి మాఫియాను తరిమి కొట్టెందుకు ప్రాణాలు పణంగా పెట్టేందుకు మేము సిద్ధం. అదాని వస్తే జీవితాలు బాగుపడుతాయని భావించాము. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఐరన్ లెగ్.. కాకాణి మంత్రి అయిన తరువాత జిల్లాలో ఐదు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఐరన్ లెగ్ కాకాణి మంత్రిగా నియోజకవర్గంలో అడుగుపెడితే సర్వనాశనం అవుతుందని అడ్డుకున్న ఎమ్మెల్యేని బయట జిల్లాకు పంపించాడు’’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - Feb 17 , 2024 | 04:48 PM

Advertising
Advertising