అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
ABN, Publish Date - Jun 07 , 2024 | 11:23 PM
విద్యుత అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారుతోంది.
గిరిజన కాలనీలో విద్యుత సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు కనెక్షన రాక ఎండుతున్న పంటలతో రైతు ఆక్రందన
మదనపల్లె/టౌన, జూన 7: విద్యుత అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారుతోంది. మదనలపల్లె మండలం సీటీఎం పంచాయతీ చెంచులక్ష్మికాలనీలో 50 కుటుంబాలు నివసిస్తుండగా వారికి విద్యుత సౌకర్యం కల్పించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో కాలనీవాసులు సుదూర ప్రాంతాల విద్యుత స్తంభాల నుంచి ఏదో విధంగా ఇంటిలో అంధకారంలేకుండా వైర్లసాయంతో విద్యుత సౌకర్యం కల్పించుకున్నారు. దీంతో శుక్రవారం కాలనీలోని విద్యుత సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నియోజకవర్గ ఇనచార్జి టి.కృష్ణప్ప స్థానిక ఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో రూరల్ డీఈఈ సురేంద్ర నాయక్‌కు కలిసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణప్ప మాట్లాడు తూ సీటీఎం పంచాయతీ చెంచులక్ష్మి కాలనీలో 50 గిరిజన కుటుం బాలు కాలనీలో విద్యుత స్తంభాలు లేకపోవడంతో దూరంగా ఉన్న స్తంభాల నుంచి సొంత డబ్బులతో విద్యుత తీగలు లాగి ఇళ్లకు విద్యుత మీటర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత వాడుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన నిధులు కింద ఈ కాలనీలో ఇంత వరకు ఎలాంటి అభి వృద్ధి కార్యక్రమాలు చేయలేదని, కనీసం విద్యుత స్థంబాలు లేకపోవ డంతో వీధిదీపాలు కూడా వేసుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత వాడే గిరిజనులకు ఉచిత విద్యుత మీటర్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై డీఈఈ సురేంద్రనాయక్ మాట్లా డుతూ గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథనాయక్, సీపీఐ నాయకులు సాంబశివ, తిరుమల, సిద్దయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత కనెక్షన కోసం.. రైతు రెండేళ్లుగా పోరాటం
పెద్దమండ్యం మండలం బండమీదపల్లె పంచాయతీ తుసువారిపల్లెకు చెందిన రైతు వై.వెంకటరమణారెడ్డికి గ్రామ సమీపంలోని మూడెకరాల వ్యవసాయ భూమిఉంది. ఇందులో రెండెకరాలలో మామిడి, అల్లనేరెడు మరో ఎకరా భూమిలో టమెటా, వరి సాగుచేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఉన్నట్లుండి బోరు ఎండిపోవడంతో సమీపంలోని వ్యవ సాయభూమిలో మరో బోరు తవ్విచారు. పుష్కలంగా నీరు పండింది. ఇందుకోసం కొత్తగా వ్యవసాయ కనెక్షనకు ప్రభుత్వానికి డబ్బులు చెల్లిం చి దరఖాస్తు చేసుకోగా అనంతరం రెండేళ్ల క్రితం 25 కేవీ ట్రాన్సఫార్మ ర్‌తోపాటు మూడు విద్యుత పోల్స్, కండక్టర్(వైరు) మంజూరు చేశారు. స్థానికంగా ఉన్న ట్రాన్సకో ఏఈ శంకర్‌రెడ్డి సూచనల మేరకు విద్యుత స్తంభాలు నాటడంతోపాటు ట్రాన్సఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె కూడా రైతు నిర్మించుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఓ రైతు అభ్యంతరం చెబుతున్నాడంటూ ట్రాన్సఫార్మర్ ఏర్పాటు చేయకుండా, విద్యుత లైన లాగకుండా నిలిపేశారు. ఈ క్రమంలో అప్పటికే నాటిన విద్యుత పోల్స్‌ను తొలగించి మరో మార్గంలో ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందంటూ రైతును ట్రాన్సకో అధికారులు ఇబ్బం దులకు గురిచేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా రైతుల నుంచి అభ్యం తరం వస్తే.. వాస్తవ పరిస్థితిని అనుసరించి నిజంగా సమస్య ఉంటే మరో మార్గాన్ని పరిశీలించాలి. అలా కాకుండా ఇక్కడ మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధి చెప్పారంటూ ట్రాన్సకో అధికారులు పంట ఎండిపోవ డానికి కారణమవుతూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతు వెంకటరమణారెడ్డి వాపోతున్నారు. చేతికొచ్చిన మామిడి, అల్లనేరెడి పంట ఎండిపోవడంతోపాటు తనకున్న మరో ఎకరా భూమి బీడుగా మారిపోతోందని, సాగులోకి తెచ్చుకోవడానికి సహకరించాలని బాధిత రైతు మదనపల్లె సబ్‌కలెక్టర్‌తోపాటు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు గ్రీవెన్సలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతలు విద్యుత్తు ట్రాన్సఫార్మర్ల మంజూరులో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఈక్రమంలో అవసరం లేని వారికి ట్రాన్సఫార్మర్లు ఇవ్వడం, అవసరం ఉన్న వారిని ఇలా ఇబ్బందు లకు గురిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ట్రాన్సకో మం డలస్థాయి అధికారి..ప్రజాప్రతినిధి మాట విని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేసి ఎండిపోతున్న పంటను కాపా డాలని బాధిత రైతు కోరుతున్నాడు.
Updated Date - Jun 07 , 2024 | 11:23 PM