ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు : బీవీ

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:10 AM

టీడీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతుందని, అధికారులు నిర్వక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

గోనెగండ్ల, జూలై 4: టీడీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతుందని, అధికారులు నిర్వక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో సమావేశ భ వనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానికంగా రెండు రోజుల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ల నిర్మాణానికి భూమి పూజ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించి ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నీటి సామర్థ్యం, ఎంవీఎస్‌ స్కీమ్‌ పనుల గురించి ఆరాతీశారు. గ్రామంలో 20 రోజుల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ ఐదేళ్లలో ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లువేశారని పీఆర్‌ అధికారులను ప్రశించగా.. అందుకు మండలంలో 2.5 కిలోమీటర్ల్ల మేర రోడ్డు వేశామని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ సాంబయ్య, పీఆర్‌డీఈ చంద్రశేఖర్‌, ఏఈలు శ్రీనివాసుల రెడ్డి, శివశంకర్‌, తహసీల్దార్‌ పార్వతి, ఎంపీడీవో సోనిబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:10 AM

Advertising
Advertising