ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh : ప్రజాదర్బార్‌కు జనం బారులు

ABN, Publish Date - Jun 27 , 2024 | 02:03 AM

రాష్ట్ర మంత్రి లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న వైనం

సావధానంగా సమస్యలు వింటున్న మంత్రి లోకేశ్‌

తాడేపల్లి, జూన్‌26: రాష్ట్ర మంత్రి లోకేశ్‌ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండడంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీరుతున్నారు. బుధవారం పెదవడ్లపూడికి చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యులు తమ గౌరవ వేతనాలు పెంచాలని లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రూ.3వేలు ఇస్తున్నారని, రూ.5-10వేలు చేయాలని కోరారు. పాఠశాలల్లో రాగిజావ, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు అదనంగా డబ్బులేమీ ఇవ్వడం లేదని, అందుకయ్యే వంటగ్యా్‌సకు తమ జీతం డబ్బుల నుంచే వెచ్చిస్తున్నామని వాపోయారు. జీతాలు కూడా సక్రమంగా అందడం లేదని, పని ఒత్తిడి అధికంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో తమ మాట వినేవారు లేరని, కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజాదర్బార్‌కు వచ్చామని చెప్పారు. అలాగే, నాలుగు చక్రాల మీటర్‌ సైకిల్‌ ఇప్పించి ఆదుకోవాలని తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన దివ్యాంగుడు ఎస్‌.రమేష్‌ విన్నవించారు. పనికి తగ్గ జీతం ఇవ్వాలని, పని ఒత్తిడి తగ్గించాలని, సెలవులు మంజూరు చేయించాలని మంగళగిరి ఆశావర్కర్లు కోరారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న సన్యాసిరావుపై చర్యలు తీసుకోవాలని విశాఖకు చెందిన బి. ప్రవీణ్‌కుమార్‌ కోరారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ సమస్యలతో తెల్లవారుజామున 5.30 గంటలకే ప్రజాదర్బార్‌ వద్ద బారులుతీరుతుండడంతో కరకట్ట కిటకిటలాడుతోంది.

Updated Date - Jun 27 , 2024 | 02:05 AM

Advertising
Advertising