ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘మౌత్‌ టాక్‌’ మాయ!

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:05 AM

సినిమాలకు రివ్యూలు, పబ్లిసిటీ ఎలా ఉన్నా... ‘మౌత్‌ టాక్‌’ ముఖ్యం! ఇది రాజకీయాల్లోనూ పనిచేస్తుందనుకున్నారేమో..

పార్టీల తరఫున రంగంలోకి దిగిన ఏజెన్సీలు

సినిమాలకు రివ్యూలు, పబ్లిసిటీ ఎలా ఉన్నా... ‘మౌత్‌ టాక్‌’ ముఖ్యం! ఇది రాజకీయాల్లోనూ పనిచేస్తుందనుకున్నారేమో... ఇప్పుడు ‘మౌత్‌ టాక్‌’ ఏజెన్సీలు వచ్చేశాయి. గుంటూరు నగరంలో ఉన్న ఒక ఏజెన్సీ గత కొన్ని నెలలుగా అధికార పార్టీ తరఫున ఈ ప్రచారం చేస్తోంది. ఆర్థికంగా బలంగా ఉన్న కొందరు ఎంపీ అభ్యర్థులు వ్యక్తిగతంగా ఇటువంటి ఏజెన్సీలతో పని చేయించుకొంటున్నారు. తన తరఫున ఒక ఏజెన్సీ 300 మందితో ‘మౌత్‌ టాక్‌’ చేస్తోందని ఒక అభ్యర్థి తెలిపారు. వీళ్లలో నుంచే ఇద్దరు ముగ్గురు టీ దుకాణాలు, హోటళ్లు, నలుగురు చేరి ముచ్చట్లు పెట్టుకునే పార్కుల వంటి ప్రదేశాలకు వెళ్లి... ఒకరికి ఒకరు సంబంధం లేనట్లుగా ఆ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ తమలో తాము మాట్లాడుకుంటున్నట్లుగా చర్చ మొదలుపెడతారు. మెల్లగా తాము కాంట్రాక్టు తీసుకున్న అభ్యర్థి ప్రస్తావన తెస్తారు. ఆ అభ్యర్ధి ఖాయంగా గెలుస్తాడని, ఎక్కడికి వెళ్లినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారని ఒకరు చెప్పడం, దానిని ఇంకొకరు సమర్థించడం! ఇలా సాగుతుందీ ‘మౌత్‌ టాక్‌’! దీనిని రక్తి కట్టించేందుకు... తమలో తాము వాదనకు దిగడం, పందేలకు సిద్ధం కావడం వంటివీ జరుగుతాయి. ‘పక్కవాళ్ల మాటలకు ప్రభావితమయ్యే లక్షణం చాలామందికి ఉంటుంది. ఆ బలహీనత పైనే ఈ వ్యాపారం జరుగుతుంది. తటస్థుల మాదిరిగా చెబితేనే ఆ ప్రభావం పడుతుంది. దీనికి అవసరమైన శిక్షణను మేం ఇచ్చి పంపుతాం’ అని ఒక నిర్వాహకుడు చెప్పారు. ఇదంతా వినడానికి బాగానే ఉందని, ఫలితం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని ఒక అభ్యర్థి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు అభ్యర్థులు ఇటువంటి ఏజెన్సీల సేవలను వాడుకొన్నారు. అక్కడ ఫలితాలు చూస్తే... గ్రామీణ ప్రాంతమంతా కాంగ్రెస్‌ అభ్యర్థులు, హైదరాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. ‘ఒక పార్టీకి అనుకూలంగా ప్రభంజనం వంటి వాతావరణం ఉంటే మేమేం చేయలేం’ అని ఒక ఏజెన్సీ నిర్వాహకుడు పేర్కొన్నారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 25 , 2024 | 04:05 AM

Advertising
Advertising