సోమవారం పోలవారం!
ABN, Publish Date - Jun 15 , 2024 | 07:12 AM
అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. ‘సోమవారం
క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర సీఎంగా ప్రతి సోమవారం సమీక్ష
తిరిగి ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. ‘సోమవారం పోలవారం’ అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ, సోమవారం ఆయన పోలవరం వెళుతున్నట్టు తెలిసింది. ఇంధనం, జల వనరులు తదితర కీలక శాఖలపై శ్వేత పత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. ఐదేళ్ల కాలంలో జగన్ ఏస్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబరు 30వ తేదీన పోలవరం హెడ్‌వర్క్స్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73 శాతం పనులు పూర్తిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి అయింది. మిగిలిన 27 శాతం పనులు పూర్తి చేయలేక జగన్ చేతులు ఎత్తేశారు. వాస్తవానికి, ఈ డ్యామ్‌ల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతోపాటు, డయాఫ్రమ్‌వాల్‌పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్‌వే , స్పిల్ చానల్ నిర్మాణం, తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియల్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా .. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ ఆరోతేదీన .. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండర్‌కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020, 21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. ఎగువ,దిగువ కాఫర్ డ్యామ్‌ల్లో సీపేజీ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు.
Updated Date - Jun 15 , 2024 | 07:12 AM