ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం

ABN, Publish Date - Jul 07 , 2024 | 11:32 PM

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్‌ జిల్లా నాయకులు నాగప్ప, మాదాసు జగన్‌ అన్నారు.

ఎమ్మిగనూరులో జెండా ఎగురవేస్తున్న నాయకులు

ఘనంగా ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

వాడవాడలా జెండావిష్కరణలు

ఆదోని (అగ్రికల్చర్‌), జూలై 7: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని ఎంఆర్పీఎస్‌ జిల్లా నాయకులు నాగప్ప, మాదాసు జగన్‌ అన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలోని కాలనీలలో సంఘం జెండా ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం తమ నేత మంద కృష్ణ మాదిగ పోరాడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు వీరేష్‌, బాలస్వామి, తిమ్మన్న, స్వామిదాసు, ఈరన్న, నారాయణ, నరసింహ, గణేష్‌, ఈశ్వర్‌, రవీంద్ర, సంజయ్‌, రాజు పాల్గొన్నారు.

ఆలూరు : ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆలూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుకట్ట వద్ద మహాజన సోషలిస్ట్‌ పార్టీ జిల్లా నాయకుడు ముత్యాల గదిలింగ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి నాయకులు శేఖర్‌, సుధాకర్‌, బాలరాజు, నెట్టికంటి, చిన్నరాయుడు, గంగాధర్‌, మహిళా అధ్యక్షురాలు కేంచమ్మ పాల్గొన్నారు.

కౌతాళం : మండల పరిధిలోని గుడికంబాలి గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ 30వ ఆవిర్భావ దినోత్సవం, సంఘ వ్వవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు రాజబాబు, జిల్లా నాయకులు దుర్గప్ప సీనియర్‌ నాయకుడు ఆనంద్‌ మాదిగ, నరసింహులు, ముఖేష్‌, రాజేంద్ర, గాబ్రేల్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు : ఉమ్మడి తెలుగురాష్ర్టాల్లో మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచింది మందాకృష్ణ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్‌ సంఘమని రాష్ట్ర కార్యదర్శి ఆనంద్‌ చైతన్య అన్నారు. సంఘం కార్యాలయం దగ్గర ఉద్యోగలు సమాఖ్యా నాయకులు అంపయ్య జెండాను ఎగురవేశారు. ఆనంద్‌ చైతన్య మాట్లాడుతూ 30ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌ అణగారిన వర్గాలకు అండగా నిలిచి వారి హక్కుల కోసం పోరాటం చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మాదిగలు ఐక్యంగా హక్కుల సాధనకోసం ఉద్యమించాలన్నారు. నాయకులు పూలచింత పెద్దయ్య, శాంతిరాజు, పౌలయ్య, ప్రకాశం, ప్రభాకర్‌, దేవదాసు, నరసన్న, మారెప్ప, సోమన్న, బోయ శీను, గువ్వలదొడ్డి లింగన్నలు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 11:32 PM

Advertising
Advertising
<