అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి లోకేశ్
ABN, Publish Date - Aug 22 , 2024 | 04:44 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో టీడీపీ యువ నేత, మంత్రి లోకేశ్ బుధవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
అమరావతి/న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు రావడంతో టీడీపీ యువ నేత, మంత్రి లోకేశ్ బుధవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కొన్ని రాజకీయ అంశాలపై మాట్లాడే నిమిత్తం షా ఆయన్ను పిలిపించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వస్తారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేశ్ బుధవారం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను చర్చించినట్లు లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Updated Date - Aug 22 , 2024 | 04:44 AM