ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:43 AM

ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

ఎర్రచందనం స్మగ్లర్లపై కూడా..

పిల్లలు, మహిళలకు పటిష్ఠ భద్రత : డీజీపీ

ఐరాల(కాణిపాకం), జూలై 14: ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కేసులను సమర్థంగా విచారించడానికి పోలీసులు శక్తివంచన లేకుండా శ్రమించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలుతున్న మద్యాన్ని అడ్డుకుంటామన్నారు. గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. దీనికోసం చెక్‌ పోస్టులను బలోపేతం చే సి, వాహనాలను తనిఖీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లలు, మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేస్తామని వెల్లడించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచుతామన్నారు. నేరాలను అదుపులో ఉంచేందుకు సీసీ కెమేరాలు, డ్రోన్లు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరికరాలను విస్తృతంగా వినియోగిస్తామని చెప్పారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. కాగా, ఆదివారం ఉదయం డీజీపీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

గంజాయి ముఠా అరెస్టు

రేపల్లె, జూలై 14: రేపల్లె మండలం పెనుమూడి కృష్ణానది వద్ద వైసీపీ నాయకులు, మరికొంతమందితో కలిసి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ పెనుమూడి వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం తెలియడంతో పట్టణ సీఐ నీజర్‌బేగ్‌ ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటుచేసి 10 మందిని అరెస్టు చేశామన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుల నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరస రాజ్‌కుమార్‌, తోటఽ ధనుష్‌కుమర్‌, తోట అనిల్‌కుమార్‌ అరకు, పాడేరులో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయాలు జరుపుతురని పేర్కొన్నారు. కాగా.. వైసీపీ నాయకుడు ఆళ్ల రాజ్‌పాల్‌, బంటి పరారీలో ఉన్నారని తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 04:43 AM

Advertising
Advertising
<