ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:09 AM

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

మాజీ జేడీ లక్ష్మీనారాయణ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 20: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక రవీంద్ర మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రఽథమ సంవత్సరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఈ నాలుగు సంవత్స రాలు మెదడుకు పదును పెట్టి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఇంజ నీరింగ్‌ విద్యార్థులకు ఉండాల్సిన మొదటి లక్షణం టెక్నాలజీని వాడుకోవడం కాదని, అది ఎలా వచ్చిందో దానిపై పరిశోధన చేయాలన్నారు. కార్యక్ర మంలో ప్రిన్సిపల్‌ కేఈ శ్రీనివాసమూర్తి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

యువ ఓటర్లు అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలించాలి: యువ ఓటర్లు ఎన్ని కల్లో పార్టీలకు బదులుగా అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలించి ఓటు వేస్తే మంచి ఫలితాలు వస్తాయని మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళ వారం జగన్నాథగట్టుపై ఉన్న ఐఐఐటీ డీఎం ప్రాంగణంలో బీటెక్‌ విద్యార్థులకు ఇంట్రడక్షన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసమే కాకుండా పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో రిజి స్ట్రర్‌ గురుమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 01:10 AM

Advertising
Advertising
<