ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు ఆదోనికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాక

ABN, Publish Date - May 04 , 2024 | 11:18 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఆదోనికి వస్తున్నారు.

ఆదోని, మే 4: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఆదోనికి వస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆర్ట్స్‌ కళాశాలకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో జిమ్‌ సర్కిల్‌, తిక్కస్వామి దర్గా, ఎమ్మిగనూరు సర్కల్‌ వరకు రోడ్‌ షో నిర్వహిస్తారు. భీమాస్‌ సర్కిల్‌ వరకు పాదయాత్రగా నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన ఏర్పాట్లను శనివారం డీఎస్పీ శివనారాయణ స్వామితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఖాళీ చేసి, అభివృద్ధిని దూరం చేశాడన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి ఆదోని నియోజకవర్గానికి ఇచ్చిన హామీలలో ఒక్కటేనా నెరవేర్చారా అంటూ నిలదీశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, దేవేంద్రప్ప, వెంకటేష్‌ చౌదరి, శ్రీకాంత్‌ రెడ్డి, జనసేన మల్లప్ప, రంగన్న, రామస్వామి, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:18 PM

Advertising
Advertising