ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకాశం పంతులకు ఘన నివాళి

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:23 AM

మండలంలోని టంగుటూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన, గాంధీజీ చిత్రపటాలకు రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన రెడ్డి శుక్రవారం ఘన నివాళులర్పించారు.

ప్రకాశం పంతులు, గాంధీ చిత్రపటాలకు నివాళులర్పిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, ఆగస్టు 23: మండలంలోని టంగుటూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన, గాంధీజీ చిత్రపటాలకు రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన రెడ్డి శుక్రవారం ఘన నివాళులర్పించారు. ప్రకాశం పంతులు స్వాతంత్య్ర ఉద్య మంలో పాల్గొని దేశానికి ఎన్నో సేవలందించారన్నారు. గ్రా మ స్వరాజ్యం కోసం పటుబడ్డ గాంధీజీ సేవలను మంత్రి బీసీ కొనియాడారు.

ప్యాపిలి: స్థానిక రెవెన్యూ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తహసీల్దారు భారతి, డిప్యూటీ తహ సీల్దారు మారుతి, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, నవీనపాటి, వీఆర్వోలు సోమశేఖర్‌, పెద్దయ్య, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు భావితరాలకు ఆదర్శమని అరుణోదయ పాఠశాల హెచఎం ఇమాంహుశేన అన్నారు. శుక్రవారం ప్రకాశం పంతులు జయంతిని పురష్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అమీర్‌బాషా, విద్యార్థులు పాల్గొన్నారు.

చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని జిల్లా పరిషత బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయం తిని ఘనంగా నిర్వహించారు. ఇనచార్జి హెచఎం శాస్త్రీ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పీడీ దాదాపీర్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:23 AM

Advertising
Advertising
<