ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

న్యాయాధికారుల బదిలీ

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:46 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కర్నూలు(లీగల్‌), ఏప్రిల్‌ 25: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో ఖాళీగా ఉన్న ఎక్సైజ్‌ కోర్టు మేజిస్ర్టేట్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా పని చేస్తున్న ఎం.సరోజమ్మను బదిలీ చేశారు. బనగానపల్లె జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా పని చేస్తున్న కిషోర్‌ కుమార్‌ను ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా బదిలీ చేశారు. డోన్‌ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న పి.హనీషాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారిగా బదిలీ చేశారు. ఈ స్థానంలో చిత్తూరు జిల్లా పీలేరు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న సాకే జ్యోతిని నియమించారు. ఖాళీగా ఉన్న నందికొట్కూరు కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి స్థానంలోకి పత్తికొండ జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.దివ్యను బదిలీ చేశారు. ఎమ్మిగనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న గురు అరవింద్‌ను చిత్తూరు జిల్లా వాయల్పాడు కోర్టుకు బదిలీ చేశారు. ఖాళీగా ఉన్న ఆదోని మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పని చేస్తున్న ఎం.లీలాసాయి సుభాష్‌ను నియమించారు. నంద్యాల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేస్తున్న జి. అర్చనను ఖాళీగా ఉన్న ఆదోని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. బదిలీలు అయిన ఈ న్యాయాధికారులందరూ మే నెల 3వ తేదీలోగా బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులో పేర్కొంది.

Updated Date - Apr 25 , 2024 | 11:46 PM

Advertising
Advertising