ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు వినాయక నిమజ్జనం

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:24 PM

నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఈనెల 7 వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

నంద్యాలలో చిన్న చెరువు కట్ట

నంద్యాలలో చిన్న చెరువు కట్ట వద్ద

ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు

నంద్యాల కల్చరల్‌/నంద్యాల క్రైం, సెప్టెంబరు 10: నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఈనెల 7 వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా ఆధ్వర్యంలో గణేష్‌ కేంద్రసమితి సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌లో గణేష్‌ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహాల స్వాగత సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమితి సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ముఖ్య అతిఽథులు, ప్రభుత్వ అధికారులు, గణేష్‌ కేంద్ర సమితి సభ్యుల ఆధ్వర్యంలో మొదటి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ప్రారంభించనున్నారు. నిమజ్జనానికి తరలివచ్చే వినాయక విగ్రహాలకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. చిన్న చెరువు కట్ట సమీపంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చిన్నచెరువుకట్ట వద్ద తాత్కాలిక రోడ్లు, 4+1 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు గణేష్‌ కేంద్ర సమితి సభ్యులు తెలిపారు.

శోభాయాత్ర ఇలా...

నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వరకు జరిగే వినాయక నిమజ్జన శోభాయాత్రపై ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా ఆరా తీశారు. సిబ్బందితో కలిసి వినాయక ఘాట్‌తోపాటు కుందూనది పరిసర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. శ్రీనివాససెంటర్‌, భైర్మల్‌వీధి, విక్టోరియా రీడింగ్‌ రూమ్‌, గాంధీ చౌక్‌, జామియా మస్జిద్‌, ఆత్మకూరు బస్టాండ్‌ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. వినాయక ఘాట్‌ వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే భారీ క్రేన్లను, వాటికి సంబంధించిన డ్రైవర్లను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసుకోవాలని పోలీస్‌, ఇతర శాఖల సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 527 వినాయక విగ్రహాలను బుధవారం నిమజ్జనం చేయనున్నారన్నారు. ఎస్పీ వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ జె.వి. సంతోష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఏరిషావలి, ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునగుప్త, గణేష్‌ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:24 PM

Advertising
Advertising