క్షుద్ర పూజల కలకలం
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:57 PM
మండలంలోని రూపనగుడి గ్రామ సమీపంలోని కుందూ నది వంతెన కింద క్షుద్ర పూ జలు కలకలం లేపాయి.
ఉయ్యాలవాడ, జూలై 15: మండలంలోని రూపనగుడి గ్రామ సమీపంలోని కుందూ నది వంతెన కింద క్షుద్ర పూ జలు కలకలం లేపాయి. సోమవారం ఉదయం వంతెన కింద పసుపు, కుంకుమలతో దీర్ఘచతురస్ర ఆకారం చేసి అందులో కొన్ని ఆకారాల బొమ్మలు గీచి పూజలు చేసిన ఆనవాలను రజకులు గుర్తించారు. అక్కడ ఓ దిష్టిబొమ్మను కూడా కాల్సివేసిన అనవాలు కనిపిస్తున్నాయి. క్షుద్ర పూజల వాసన రాకుండా అక్కడ సెంటు ఉంచారు. ఈ సెంటు వాసన దాదాపుగా పది మీటర్ల దూరం వస్తుంది. ప్రతి రోజు ఉయ్యాలవాడ, రూపనగుడి గ్రామాల ప్రజలు స్నానాలకు వెళ్తుంటారు. క్షుద్ర పూజల ఎలాంటి ఆపద వస్తుందోనని ప్రజలు భయాంద్రోళనకు గురవుతున్నారు.
Updated Date - Jul 15 , 2024 | 11:57 PM