ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:22 AM

నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్‌హాలులో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

నంద్యాలలో నివాళి అర్పిస్తున్న జేసీ, అధికారులు

నంద్యాల (కల్చరల్‌), ఆగస్టు 23: నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్‌హాలులో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జేసీ విష్ణుచరణ్‌ జ్యోతి ప్రజల్వన గావించి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం డీఆర్వో పద్మజ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ముస్తాక్‌ అహ్మద్‌ పాల్గొని చిత్రపటానికి పుష్పాలంకరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సిబ్బంది, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గడివేముల: మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి హైస్కూల్‌లో, తహసీల్దార్‌ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బీవీఎన్‌ విద్యాసాగర్‌, రాజరాజేశ్వరి హైస్కూల్‌లో కరస్పాండెంట్‌ రామేశ్వరరావు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్‌ గురునాథం, రెవెన్యూ సిబ్బంది, రాజరాజేశ్వరి హైస్కూల్‌ ఏవో ఎంబీఎన్‌ రాఘవేంద్రరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: యువత శాస్త్రవిజ్ఞానంపై మక్కువం పెంచుకుని నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మావతిబాయి పేర్కొన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అధ్యాపకులు శివరామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, రాజశేఖరరెడ్డి ఉన్నారు.

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి బాయి పేర్కొన్నారు. శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తిరుపతమ్మ, కీర్తిచరణ్‌, రాజ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:22 AM

Advertising
Advertising
<