ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బక్రీద్‌కు పటిష్ట భద్రత

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:00 AM

ముస్లింలు బక్రీద్‌ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ అన్నారు.

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ జి.కృష్ణకాంత్‌

కర్నూలు, జూన్‌ 16: ముస్లింలు బక్రీద్‌ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ అన్నారు. ఆదివారం ఆయన చెక్‌పోస్టులు, వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పూలబజారు, పట్టణ శివారులోని జోహరాపురం, గుత్తి పెట్రోల్‌ బంకు, సంతోష్‌ నగర్‌ హైవే దగ్గర ఉన్న కొత్త ఈద్గా, పంచలింగాల చెక్‌పోస్టుల వద్ద ఆయన తనిఖీ చేశారు. బర్రీద్‌ పండుగ సందర్భంగా సోమవారం ట్రాఫిక్‌ మళ్లింపు, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా హిందూ, ముస్లింలు సహకరించాలని కోరారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే వారిపై నిఘా ఉంచామని చెప్పారు. నగరంలో పోలిస్‌ పికెట్లు, మొబైల్‌ పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. పుకార్లు, వదంతులను నమ్మకూడదని సమస్యలు ఉంటే డయల్‌ 100కి గానీ, స్థానిక పోలీసులకు గానీ ప్రజలు తెలియజేయాలని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ డీఎస్పీ విజయశేఖర్‌, సీఐలు నాగరాజు యాదవ్‌, ప్రసాద్‌, పవన్‌కుమార్‌, శంకరయ్య, ట్రాఫిక్‌ సీఐ గౌతమి, ఎస్‌ఐ ఖాజావలి ఉన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:00 AM

Advertising
Advertising