సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:39 AM
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్రిమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
మంత్రి టీజీ సమక్షంలో టీడీపీలో చేరిన కార్పొరేటర్
కర్నూలు(అర్బన్), జూలై 30: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పర్రిమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో నగరానికి చెందిన ఐదో వార్డు కార్పొరేటర్ జీఎల్‌వీ సుజాత, వైసీపీ నాయకులు శేషుయాదవ్ తదితరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధ్ది చేసేం దుకు ముందుకు వెళుతున్నామన్నారు. నాయకులు మాట్లాడు తూ మం త్రి టీజీ భరత్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పరి శ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రిని కోరారు.
Updated Date - Jul 31 , 2024 | 12:39 AM