సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:07 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి అర్జీలను స్వీకరించారు.
- ఆదోని సబ్ కలెక్టర్
మౌర్య భరద్వాజ్
- ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
ఆదోని, సెప్టెంబరు 9: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి అర్జీలను స్వీకరించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
ఆదోని మండలం పెద్దరిహరివాణం గ్రామానికి చెందిన హనుమంతు పొలం సర్వే నెంబర్ 85 ఏలో 1.37 ఎకరాలు, 9ఏలో ఎకరాలు ఉండగా ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని కోరాడు. అదే గ్రామానికి చెందిన దేవమ్మ తన భర్త పేరుపై ఉన్న పొలాన్ని తన పేరుపై మార్చి పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వాలని అర్జీ ఇచ్చింది.
ఆదోని మండలం కల్లుబావికి చెందిన మల్లయ్యకు సర్వే నెం.200లో 0.77 సెంట్ల భూమి ఉండగా వారస త్వంగా రావలసిన 0.20 సెంట్లను ఆన్‌లైన్ చేయాలని అర్జీ ఇచ్చాడు. ఏవో వసుంధర్, సర్వేయర్ వేణు సూర్య శ్రీనివాస రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, డీఎల్పీవో నూర్జహాన్, డీఎల్‌డీవో నాగేశ్వరరావు, హౌసింగ్ డీఈ రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డీఎం మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 01:07 AM