ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్యాస్‌ నిక్షేపాలపై కొలిమిగుండ్లలో ఓఎన్‌జీసీ సర్వే

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:55 PM

కొలిమిగుండ్ల మండలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంఽధించిన గ్యాస్‌ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసి భూగర్భ సర్వే ఇటీవల ప్రారం భించారు.

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 15: కొలిమిగుండ్ల మండలంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంఽధించిన గ్యాస్‌ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసి భూగర్భ సర్వే ఇటీవల ప్రారం భించారు. కొలిమిగుండ్లలో భూగర్భంలో గ్యాస్‌ నిక్షేపాలు కనుగొనేందుకు పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాయునిపల్లె రోడ్డుమార్గంలో క్యాంపస్‌ ఆఫీస్‌, పరికరాల షెడ్లు నిర్మించారు. జియలాజికల్‌ శాఖ అధికారులు, వర్కర్లు 400 మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, బెంగాల్‌, అస్సాం, బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, కర్ణాటక, చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి జిల్లాల్లో ఓఎన్‌జీసీ భూగర్భ సర్వేలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కడప, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కూడా భూగర్భ సర్వే ప్రారంభించారు. ప్రస్తుతం కొలిమిగుండ్ల మండలంలో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. 24 అడుగు లోతు వరకు బోరువేసి అక్కడి నుండి అయస్కాంత తరంగాల ద్వారా ప్రత్యేక పరికరాలు భూగర్భంలోకి పంపి గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నది లేనిది కనుగొనే పనిలో ఉన్నారు. సర్వే కార్యక్రమం జూన్‌ 15 వరకు కొనసాగుతుందని సర్వే వివరాలను డెహ్రాడూన్‌కు పంపించిన అనంతరం సంవత్సరానికి రిజల్ట్‌ వస్తుందని ఇదంతా ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీ సర్వే అధికారులు తెలిపారు.

Updated Date - Apr 15 , 2024 | 11:55 PM

Advertising
Advertising